Rashmika Mandanna: మేము అందుకే విడిపోయాం.. అతనితో గొడవపై రష్మిక మందన్న క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో హీరోయన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకే ఒక్క సినిమాతో విశేషమైన పాపులారిటీ సంపాదించుకుంటారు. అలాగే పలు రూమర్స్, వివాదాలతో విమర్శల పాలవుతుంటారు. వారిపై అనుకోని పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా హైలెట్ అవుతున్న కన్నడ అందం రష్మిక మందన్న. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మపై ట్రోలింగ్ ఎలా జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఆమె మోసపోయిందనే వార్తల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది ఈ నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
అలా చిత్రసీమలోకి : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్న చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే అదే భాషలో ఎన్నో సినిమాలు చేసింది ఆకట్టుకుంది. ఆ సమయంలోనే హీరో రక్షిత్ శెట్టితో చేసుకున్న నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

నేషనల్ క్రష్ గా: తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఛలో చిత్రం హిట్ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో రష్మిక నటించిన 'గీత గోవిందం' సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాతో ఆమెకు యువతో లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. అంతేకాకుండా ఆమెను నేషనల్ క్రష్ గా గూగుల్ తెలిపింది.
పరాజయాలు వచ్చిన: గీత గోవిందం సినిమా తర్వాత 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఈ కన్నడ చందం. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చిన తనకు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. ఇక అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది స్టన్నింగ్ బ్యూటి రష్మిక మందన్న.

ఫ్యూచర్ సినిమాలు: పుష్ప మూవీ దేశవ్యాప్తంగా హిట్ కావడంతో రష్మిక మందన్నకు ఇటు బాలీవుడ్, అటు కోలీవుడ్ లో వరుసపెట్టి అవకాశాలు వరించాయి. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి గుడ్ బై అనే సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దగుమ్మ. అనంతరం మిషన్ మజ్ను చేసింది. వారసుడు సినిమాతో మంచి హిట్ కొట్టిన ఈ బ్యూటి ప్రస్తుతం పుష్ప 2, రెయిన్ బో, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది.

గుసుగసలపై రష్మిక: కాగా ఇటీవల రష్మిక మందన్న వద్ద మేనేజర్ రూ. 80 లక్షలు కాజేసి ఆమెను మోసం చేశాడని వార్తలు జోరుగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని రష్మిక ఉద్యోగంలో నుంచి తీసేసిందని, వాళ్లిద్దరు కలిసి పనిచేయడం లేదని గుసగుసలు గట్టిగానే వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటి. తామిద్దరం కేవలం విడిగా పని చేయాలని నిర్ణయించుకున్నామని, ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది.

ప్రొఫెషనల్ వ్యక్తులం: "మేం ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందం, అవగాహనతో కెరీర్ లో విడివిడిగా ముందుకు సాగాలాని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండే వ్యక్తులం కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడివిడిగా పని చేయాలనుకుంటున్నాం. అందుకే విడిపోయాం" అని రష్మిక మందన్న, ఆమె మేనేజర్ తాజాగా వెల్లడించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











