మరోసారి రష్మిక పెళ్లి ప్రస్తావన.. వచ్చే జన్మలో మగాడిగా పుడతా.. అప్పుడు చేసుకుంటానన్న రష్మిక?
రష్మిక మందన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా నార్త్ లో కూడా విడుదలైన తర్వాత రష్మిక పేరు ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అయితే గత కొద్దిరోజుల నుంచి ఆమె పెళ్లి అంశం నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ విషయం మీద పలు సార్లు స్పందించిన రష్మిక తాజాగా కూడా మరోమారు పెళ్లి మీద స్పందించింది. ఆ వివరాలు

కఠినంగానే
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారి టాలీవుడ్ సహా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. రష్మిక, విజయ్‌లు పెళ్లి చేసుకోనున్నారని, వీరిద్దరూ న్యూ ఇయర్ వేడుకలు ఒకే చోట జరుపుకున్నారని ఇలా రకకల కామెంట్స్ వినిపించాయి. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తమ పెళ్లి విషయంలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తవమని ఒకింత కఠినంగానే విజయ్ బదులిచ్చాడు.

సమయం లేదు
ఇక కొద్దీ రోజుల క్రితం రష్మిక కూడా స్పందిస్తూ . 'ఆ వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. ఇలాంటి వార్తలు నాకు కొత్త కాదు. వాటిని విని నవ్వుకోవటం అలవాటైపోయింది. ప్రేమించి, పెళ్లి చేసుకునేంత సమయం నా దగ్గర లేదు' అని రష్మిక తేల్చి చెప్పింది. అయితే ఆమె శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించిన సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈనెల 4న శుక్రవారంనాడు విడుదల కాబోతోంది.

సంబంధం లేకుండా
ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ గురువారం హైదరాబాద్లోని స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ క్రమంలో రష్మిక మందన్న మాట్లాడుతూ, చాలా కాలం తర్వాత ఫ్యామిలీ సినిమా చేశామని థియేటర్ కి వచ్చి చూడండని కోరారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూసి సినిమాను ఎంజాయ్ చేస్తారని ఆమె పేర్కొంది.

ఎంజాయ్ చేయండి
ఈ సినిమాలో పాత్రలు మన ఇంట్లో అమ్మ, చెల్లి ఎలా మాట్లాడతారో అలానే వుంటాయని, కొన్ని సంఘటనలు మన ఇంట్లో జరిగేవిగా కనిపిస్తాయని పేర్కొన్నారు. మా ఇంటిలో కూడా అమ్మ, నాన్న, చెల్లి ఈ సినిమా విడుదల రోజు మొదటి ఆట చూస్తానన్నారని అందుకే మీరు కుటుంబంతో ఎంజాయ్ చేయండి అని ఆమె చెప్పుకొచ్చింది.

మంచి మనసున్న వ్యక్తి లభిస్తే
ఆ తర్వాత రష్మిక మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పుష్ప, ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాలు చేశాక మహిళగా డ్రెస్సింగ్‌లో చాలా కష్టం అనిపించిందని. అందుకే వచ్చే జన్మంటూ వుంటే మగవాడిగా పుడతానంటూ కామెంట్స్ చేసింది. ఇక నిజజీవితంలో పెళ్లి ఎప్పుడు అని అడగగా మంచి మనసున్న వ్యక్తి లభిస్తే చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

పెళ్లి కామెంట్స్
ఇప్పటికే ఎవరిని అయినా అలాంటి వారిని చూసుకున్నారా? అంటే ఇప్పటి వరకు ఎవరితో ఫిక్స్ కాలేదని తేల్చిచెప్పింది. అలాగే పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్ అయ్యారు కదా తెలుగులో చిన్న సినిమాలు చేస్తారా? అని ప్రశ్నిస్తే తన పాత్ర కొత్తగా ఉంటే ఖచ్చితంగా చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. మొత్తం మీద రష్మిక చేసిన పెళ్లి కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.


Click it and Unblock the Notifications











