For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విజయ్‌తో రిలేషన్‌పై రష్మిక ఓపెన్ స్టేట్‌మెంట్: అలాంటి సైగలతో మేటర్ రివీల్.. ఒకేసారి ఆ మాట అనడంతో!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా.. చాలా ఎక్కువ గుర్తింపును దక్కించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. అద్భుతమైన నటనతో టాలీవుడ్ జనాలను ఫిదా చేసిన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో తనకున్న రిలేషన్‌పై ఓపెన్ అయిపోయిందామె. ఈ మేరకు రష్మిక మందన్నా సోషల్ మీడియా వేదికగా అతడితో బంధంపై క్లారిటీ ఇచ్చింది. ఆ సంగతులు మీకోసం!

   అక్కడ మొదలైన కెరీర్.. ఇక్కడ ఫేమస్

  అక్కడ మొదలైన కెరీర్.. ఇక్కడ ఫేమస్

  కన్నడంలో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కిర్రాక్ పార్టీ'తో రష్మిక మందన్నా హీరోయిన్‌గా పరిచయం అయింది. అందులో అదరగొట్టేయడంతో ఆ వెంటనే అదే భాషలో ‘అంజనీ పుత్ర', ‘చమ్మక్' వంటి చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన ‘ఛలో'తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకీ ప్రవేశించింది. ఇది హిట్ అవడంతో రష్మిక తెలుగులో మంచి ఆరంభాన్ని అందుకుంది.

  వరుస విజయాలతో సత్తా.. లక్కీ చార్మ్‌గా

  వరుస విజయాలతో సత్తా.. లక్కీ చార్మ్‌గా

  దక్షిణాదిలో పలు భాషల్లో రష్మిక మందన్నా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, తెలుగులో మాత్రమే ఆమెకు ఎక్కువ సక్సెస్ రేటు ఉంది. ఆమె కెరీర్‌లో ‘ఛలో' తర్వాత ‘గీత గోవిందం', ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ' వంటి హిట్లు దక్కాయి. ఇక, ‘దేవదాస్', ‘డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఎక్కువ విజయాలు ఉండడంతో ఆమె లక్కీ చార్మ్ అనిపించుకుంటోంది.

  ఇక్కడ అయిపోయింది.. ఇప్పుడు అక్కడ

  ఇక్కడ అయిపోయింది.. ఇప్పుడు అక్కడ

  రష్మిక మందన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప'లో హీరోయిన్‌గా చేస్తోన్న ఆమె.. శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్నీ చేస్తోంది. వీటితో పాటు ‘మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, మిగిలిన భాషల్లోనూ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది.

   పర్సనల్ లైఫ్‌ను మాత్రం అలా సాగిస్తోంది

  పర్సనల్ లైఫ్‌ను మాత్రం అలా సాగిస్తోంది


  వాస్తవానికి రష్మిక మందన్నా సినిమా కెరీర్‌ను ఆరంభించిన తొలినాళ్లలోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఆ వెంటనే అతడితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, అర్థాంతరంగా ఈ బంధానికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

   అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ


  వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నప్పటికీ.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా తన ఫాలోవర్లను రోజు రోజుకూ పెంచుకుంటూ దూసుకుపోతోంది.

  విజయ్‌ గురించి రష్మిక ఓపెన్ స్టేట్‌మెంట్

  విజయ్‌ గురించి రష్మిక ఓపెన్ స్టేట్‌మెంట్

  సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉండే రష్మిక మందన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో అభిమానులు అడిగే అన్ని రకాల ప్రశ్నలకు తనదైన శైలిలో స్పందించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘మీకు విజయ్ దేవరకొండ ఎంత స్పెషల్' అని అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ అతడితో ఉన్న రిలేషన్‌పై ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.

  గలతో మేటర్ రివీల్.. ఆ మాట అనడంతో

  గలతో మేటర్ రివీల్.. ఆ మాట అనడంతో

  టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ గురించి స్పందిస్తూ హగ్ చేసుకుంటున్నట్లు సైగలు చేసింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. అదే సమయంలో ‘బెస్ట్ ఫ్రెండ్' అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. తద్వారా తమ ఇద్దరి రిలేషన్ గురించి వస్తున్న వార్తలపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. ఇక, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Very Active in Social Media. Now She Gave Clarity about Vijay Devarakonda Relation In Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X