For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానికి సిద్ధంగా లేను.. అందుకే వదులుకున్నా.. సినిమా అంటే అదొక్కటే కాదు: రష్మిక మందన్న

|

సినీ ఇండస్ట్రీలో కొందరు ఏహీరోయిన్లకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కేవలం ఒకటి, రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ వచ్చేస్తుంది. అయితే ఆ తర్వాత అదే హీరోయిన్ ఏ కారణం చేతనైనా తనకు వచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసిందంటే చాలు.. ఇక రంగంలోకి దిగేస్తారు గాసిప్ రాయుళ్లు. ఆమె ఫలానా చిత్రం నుంచి వైదొలగడానికి కారణం అదీ, ఇదీ అంటూ వార్తలు పుట్టిస్తుంటారు.

తాజాగా అలాంటి పరిణామమే ఎదుర్కొన్నానని చెబుతోంది యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న. టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ కన్నడ భామ ఇప్పటికే సూపర్‌స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ హీరో నితిన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు పట్టేసిన సంగతి తెలిసిందే.

 Rashmika Mandanna Clarity On Jersey Hindi Remake

ఈ నేపథ్యంలోనే రష్మిక క్రేజ్ దృష్ట్యా ఆమెకు బాలీవుడ్‌ ఆఫర్ దక్కిందని వార్తలు వచ్చాయి. తెలుగులో సూపర్ హిట్ సాధించిన జెర్సీ సినిమా హిందీ రీమేక్‌లో నటించడానికి రష్మికను సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించిందని టాక్ నడించింది. దీంతో అడిగినంత పారితోషికం ఇవ్వకపోవడం వల్లే హిందీ జెర్సీలో నటించేందుకు 'నో' చెప్పిందని వార్తలు గుప్పుమన్నాయి.

కాగా, ఇలాంటి వార్తలపై తాజాగా రష్మిక స్పందించింది. జెర్సీ హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఆఫర్ తన వద్దకు వచ్చిందని, అయితే ఆ పాత్రకు తాను న్యాయం చేయలేననిపించిందని రష్మిక పేర్కొంది. ''ఆ పాత్రలో చాలా ఇన్వాల్వ్ అయి నటించాలి. నేను అందుకు సిద్ధంగా లేను. అందుకే ఆ ఆఫర్ రిజెక్ట్ చేశాను'' అంతే తప్ప అందరూ అనుకుంటున్నట్టు రెమ్యునరేషన్ కారణమే కాదు అని రష్మిక చెప్పింది. సినిమా అంటే కేవలం డబ్బే కాదని ఈ సందర్బంగా రష్మిక వెల్లడించింది.

English summary
Hero Shahid Kapoor, who is on a roll with the success of Kabir Singh, has bagged the Hindi remake of the Telugu hit Jersey. This remake is release on August 28,2020. Rashmika Mandanna rejects Jersey movie offer.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more