For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గుండుతో కనిపించి షాకిచ్చిన రష్మిక: ఏకంగా అలా మార్చారేంటి.. బూతులు రావు కాబట్టి సరిపోయింది అంటూ!

  |

  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న వారిలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఒకరు. ఆమె చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో ఊహించని రీతిలో గుర్తింపును దక్కించుకుంది. తద్వారా వరుసగా బడా హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు పట్టేస్తోంది. దక్షిణాదిలో సత్తా చాటిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇస్తోంది. దీంతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్నా గుండుతో కనిపించి షాకిచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  అక్కడి నుంచి ఇక్కడకు.. రష్మిక ఫుల్ బిజీ

  అక్కడి నుంచి ఇక్కడకు.. రష్మిక ఫుల్ బిజీ

  ‘కిర్రాక్ పార్టీ' అనే కన్నడ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది రష్మిక మందన్నా. ఆ వెంటనే అదే భాషలో ‘అంజనీ పుత్ర', ‘చమ్మక్' వంటి చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే ‘ఛలో' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకీ ప్రవేశించింది. మొదటి సినిమాతోనే ఆకట్టుకోవడంతో ఇక్కడ ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఆమె ఫుల్ బిజీగా మారిపోయింది.

  వరుస హిట్లతో దూకుడు.. లక్కీ హీరోయిన్

  వరుస హిట్లతో దూకుడు.. లక్కీ హీరోయిన్

  రష్మిక మందన్నా టాలీవుడ్‌లో చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం హిట్లుగా నిలిచాయి. మొదటి సినిమా నుంచి ‘గీత గోవిందం', ‘సరిలేరు నీకెవ్వరు', ‘భీష్మ' వంటి భారీ హిట్లు ఆమె సొంతం అయ్యాయి. అయితే, ఎన్నో అంచనాలతో విడుదలైన ‘దేవదాస్', ‘డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను నిరాశ పరిచాయి. అయినప్పటికీ ఆమెకు తెలుగులో లక్కీ హీరోయిన్ అనే పేరు వచ్చేసిందనే చెప్పాలి.

  దేశం మొత్తం రష్మిక ప్రేమలో పడిపోయింది

  దేశం మొత్తం రష్మిక ప్రేమలో పడిపోయింది

  2020 సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైంది రష్మిక మందన్నా. గూగుల్‌లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే ఈ కన్నడ భామ పేరుతో పాటు ఆమెకు సంబంధించిన‌ సమాచారం కనిపిస్తోంది. తక్కువ సినిమాలే చేసినా ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020' గా ర‌ష్మిక ఎంపిక కావ‌డంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నట్లైంది.

  అన్ని భాషల్లో బిజీ.. బాలీవుడ్‌లోకి అడుగు

  అన్ని భాషల్లో బిజీ.. బాలీవుడ్‌లోకి అడుగు

  రష్మిక మందన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప'లో హీరోయిన్‌గా చేస్తోన్న ఆమె.. శర్వానంద్ హీరోగా రాబోతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్నీ చేస్తోంది. వీటితో పాటు ‘మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెడుతోంది. అలాగే, మిగిలిన భాషల్లోనూ నటిస్తోంది.

  ఈ ఏడాది భారీ షాక్... అక్కడ పర్లేదు కానీ

  ఈ ఏడాది భారీ షాక్... అక్కడ పర్లేదు కానీ

  ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది రష్మిక మందన్నా. ఈ నేపథ్యంలో కార్తీ హీరోగా నటిస్తోన్న ‘సుల్తాన్'తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణన్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌ఆర్‌ ప్రకాష్ బాబు, య‌స్‌ఆర్‌ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

  Pushpa Action Scenes Visual Treet, సుక్కు మార్క్ ట్విస్ట్ | Allu Arjun || Filmibeat Telugu
  గుండుతో లుక్‌తో షాకిచ్చిన రష్మిక మందన్నా

  గుండుతో లుక్‌తో షాకిచ్చిన రష్మిక మందన్నా


  రష్మిక మందన్నాకు తమిళనాడులో చేదు అనుభవం ఎదురైంది. అక్కడి సెలూన్లలో ఆమె గుండు ఫొటోలు దర్శనమిచ్చాయి. వాస్తవానికి హీరోల ఫొటోలు పెట్టి వ్యాపారం చేసుకుంటారు. కానీ, అక్కడ వింతగా ఈ స్టార్ హీరోయిన్‌కు జుట్టు లేకుండా చేసి క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎన్నో రకాలు మీమ్స్ కూడా వచ్చాయి.

  English summary
  Rashmika Mandanna is an Indian actress and model who works predominantly in Telugu and Kannada-language films. She has been dubbed by the media as the "Karnataka crush". Mandanna is among the highest-paid actresses in Telugu and Kannada cinema.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X