కాళ్ల దగ్గరకి టాప్ హీరోలు .. చాలా బాగుందంటూ రష్మిక షాకింగ్ ఆన్సర్
ఒకప్పుడు నార్త్ ఇండియా నుంచి పలువురు హీరోయిన్స్ సౌత్‌కి వచ్చి పాగా వేసేవారు. వారి డామినేషన్ ఎప్పటి నుంచో తెలుగు సహా హిందీ సినిమాలో కనిపించేది. కానీ మన దక్షిణాది నుంచి హిందీ సినిమాకి వెళ్లి హిట్ అయ్యిన హీరోయిన్స్ మాత్రం చాలా అంటే చాలా తక్కువ మందే ఉంటారని చెప్పాలి. చాలా మంది హీరోయిన్స్ అదృష్టం పరీక్షించుకున్నారు కానీ హిందీలో మాత్రం అంత సక్సెస్ కాలేదు.
కానీ అదంతా ఒకప్పుడు .. ఇపుడు మాత్రం ఒక్క హీరోయిన్ ఇదంతా మార్చేసింది అని చెప్పాలి. ఆ హీరోయిన్ ఎవరో కాదు మన దక్షిణాది నుంచే వెళ్లిన యంగ్ అండ్ టాలెంటెడ్ నటి రష్మికా మందన్నా. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ యంగ్ బ్యూటీ తెలుగు సహా తమిళ్‌లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇపుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇలా ఇపుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో టాప్ స్టార్ హీరోయిన్‌గా ఆమె నిలిచిపోయారు. రీసెంట్ గా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 తో రష్మిక ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమానే కాకుండా రష్మిక ప్రస్తుతం హిందీలో పలు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది.
తెలుగు సహా హిందీ నుంచి దాదాపు టాప్ స్టార్స్ సరసన రొమాన్స్ చేసిన నేషనల్ క్రష్‌కి మధ్యలో ఒకటే కామన్ పాయింట్ గా నిలిచింది అని చెప్పాలి. రీసెంట్ గా అల్లు అర్జున్‌తో పుష్ప 2లో ఓ షాట్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. రష్మిక కాళ్ళ దగ్గర అల్లు అర్జున్ తన చేతిలో పట్టుకొనేలా చేయాలి అంటే ఓ స్టార్ హీరోకి గట్స్ ఉండాలి అని అల్లు అర్జున్ ని పొగుడుతూ పలు కామెంట్స్ వచ్చాయి.
అయితే ఇది మాత్రమే కాకుండా ఇండియాస్ మరో స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో కూడా తన గత చిత్రం అనిమల్ లో రష్మిక ఇలాంటి పోశ్చర్ లోనే కనిపించడం వైరల్ గా మారింది. నిజానికి పుష్ప 2 తర్వాత వచ్చిన సీన్ కావడంతో ఇండియన్ సినిమా దగ్గర టాప్ స్టార్స్ రష్మిక కాళ్ళ దగ్గరే ఉన్నారు అంటూ పలు కామెంట్స్ వినిపించాయి.
అయితే ఫైనల్ గా ఈ ఐకానిక్ సన్నివేశాలపై రష్మిక మందన్న ఫైనల్ గా స్పందించింది. ఆ ఇద్దరు హీరోస్ తో కలిసి నటించడం అనేది ఒక బార్ హైని నాకు అందిస్తుంది అన్నారు. తనకు కూడా ఇలా నటించడం ఎంతో ఆనందం అని రష్మిక తెలిపారు. ఈరోజు నటిగా ఇలా ఉన్నాను అంటే అలాంటి ఇద్దరు మైండ్ బ్లోయింగ్ నటుల వల్లనేనని చెప్పుకొచ్చింది. దీనితో ఆ ఇద్దరితో కలిసి వర్క్ చేయడంపై రష్మిక పెట్టిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











