ఆతృతగా ఉందంటున్న రష్మిక.. ఇక ఆమెను ఆపడం ఎవరితరం కాదేమో!
ప్రస్తుతం యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న జోరు చూస్తుంటే.. ఇక ఆమెను ఢీకొట్టే హీరోయిన్ ఇప్పట్లో కనిపించదేమో అంటున్నారు ప్రేక్షకులు. 'ఛలో' అంటూ మెల్లగా టాలీవుడ్ గడప తొక్కిన ఈ కన్నడ భామ ఇక ఎక్కడా వెనుతిరిగి చూసిందే లేదు. మొదటి సినిమాను చిన్న హీరో నాగశౌర్యతో చేసిన రష్మిక.. ఆ తర్వాత మీడియం రేంజ్ హీరో విజయ్ దేవరకొండతో జోడీ కట్టి 'గీత గోవిందం' రూపంలో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె చేసిన రొమాన్స్, అదేవిధంగా సన్నివేశాలకు తగ్గట్లుగా చూపిన అభినయం అగ్ర దర్శకులు, అగ్ర హీరోల దృష్టిలో పడింది. వెంటనే ఆమెకు అవకాశాల పంట పండింది.
నేటి డిజిటల్ యుగంలో హీరోల కంటే హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. ఎంత గ్లామర్ ఒలకబోసినా ఓ మూడు నాలుగు సినిమాలు చేసే సరికి వారి క్రేజ్ ఫేడ్ అవుట్ అయిపోతోంది. కానీ అందుకు భిన్నంగా రష్మిక మందన్న కెరీర్ గ్రాఫ్ దూసుకు వెళ్తుండటం విశేషం. ఏ మాత్రం శృతిమించి ఎక్స్‌పోజ్ చేయకుండా, సోషల్ మీడియాలో హాట్ నెస్‌తో కూడిన ఫొటో షూట్స్ పోస్ట్ చేయకుండా వరుస అవకాశాలు చేజిక్కించుకుంటోంది రష్మిక. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో ఆమెకున్న క్రేజ్ చూస్తుంటే.. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్లను పక్కన పెట్టేస్తుందేమో అనే ఫీల్ కలుగుతోంది.

రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసిన లేటెస్ట్ సినిమా 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మరోసారి విజయ్ దేవరకొండతో లిప్ లాక్స్ చేసింది రష్మిక. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ తో ఓ సినిమా, అలాగే తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు కమిట్ అయింది ఈ కన్నడ భామ. నిన్న (శుక్రవారం) సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రష్మిక.. మహేష్ బాబుతో సెట్స్ పైకి రావాలని చాలా ఆతృతగా ఉందని చెప్పింది.


Click it and Unblock the Notifications











