లక్కు తోక తొక్కిన రష్మిక.. మరో బడా బాలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్.. ఎక్కడా తగ్గట్లేదుగా!
కన్నడ కస్తూరి రష్మిక మందన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా నార్త్ లో విడుదలై సూపర్ హిట్ కొట్టిన తర్వాత రష్మిక శ్రీవల్లిగా దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అయితే గత కొద్దిరోజుల నుంచి ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు మరో బాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది. ఆ వివరాలు

ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని
కన్నడ కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ హీరోతో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి 'గీత గోవిందం' సినిమాతో చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అందుకే ఆమె ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టింది.

నేషనల్ క్రష్‌గా
అలా రష్మిక మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో ఛాన్స్ సంపాదించి స్టార్ హీరోయిన్‌గా నిలబడిపోయింది. అంతేకాదు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా నటించి తనదైన అందాలు ఆరబోస్తూ మంచి పేరు తెచ్చుకుంది. దానికంటే ముందే నేషనల్ క్రష్‌గా మారిన ఆమె ఇప్పుడు టాలీవుడ్ సహా కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకు పోతోంది.

యానిమల్ టీం స్వాగతం
తాజాగా ఆమె మరో బాలీవుడ్ బడా ప్రాజెక్టులో భాగమైంది. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తాజాగా మేకర్స్, డైరెక్టర్ సందీప్ వంగ అధికారిక ప్రకనట చేశారు. దానికి తగ్గట్టు టీ-సిరీస్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ షేర్ చేసింది. 'ఈ ఉగాది సందర్భంగా రష్మిక మందన్నాకు యానిమల్ టీం స్వాగతం పలుకుతోంది. ఈ సమ్మర్‌లో యానిమల్ సెట్స్‌పైకి వెళ్లనుంది అని సంస్థ వెల్లడించింది.

మరో సారి బాలీవుడ్ ప్రేక్షకులను
ఇదే విషయాన్ని సందీప్ వంగ వెల్లడిస్తూ చేస్తూ.. 'అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రష్మిక మందన్నాకు యానిమల్ టీం స్వాగతం. ఇందులో రష్మిక.. గీతాంజలి పాత్ర పోషించనుంది' అని చెప్పుకొచ్చారు. ఇక ఒకరకంగా రష్మిక హిందీలో మిషన్ మజ్నుతో పాటు అమితాబ్ బచ్చన్ కుమార్తెగా కూడా ఒక సినిమా చేస్తోంది. ఇక ఎలాగూ నార్త్ లో రచ్చ చేసిన పుష్ప సీక్వెల్ గా ఆమె మరో సారి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.

మూడో సినిమాకే
అయితే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె తన మూడో సినిమాకే ఏకంగా రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ హీరోతో నటించే చాన్స్ కొట్టేయడం మాములు విషయం కాదనే చెప్పాలి. "యానిమల్" షూటింగ్ ను ఈ వేసవిలో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ "యానిమల్" సినిమానుని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్‌ల T-సిరీస్, మురాద్ ఖేతానీ సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











