అతడితో అఫైర్ నిజమే.. ఒప్పేసుకొన్న రష్మిక మందన్న!
నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తన నటనతో ఆలరిస్తున్నారు. యానిమల్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిన ఆమె ప్రస్తుతం ఉత్తరాది ప్రేక్షకుల మెప్పును పొందేందుకు ప్రస్తుతం చావా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకొని ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రేమ వ్యవహారం గురించి ఓపెన్ అయ్యారు. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..
కన్నడ భామగా ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టి వారి మనసుల్ని గెలుచుకొన్నారు. పవర్‌ఫుల్, గ్లామర్ పాత్రలనే తేడా లేకుండా నటిగా తానేంటో ప్రూవ్ చేసుకొన్నారు. ఆ తర్వాత ఆమె తమిళం, హిందీ రంగాలకు తన టాలెంట్‌ను పరిచయం చేశారు. అయితే నటిగా బీజీ కావడంతో తన పర్సనల్ విషయాలకు బ్రేకప్ చెప్పడం తెలిసిందే.

రష్మిక మందన్న నటిగా బిజీ అవుతున్న సమయంలో కన్నడ హీరోతో ఎంగేజ్‌మెంట్ కావడం.. ఆ తర్వాత వారి మధ్య కొన్ని అభిప్రాయప బేధాలు తలెత్తడంతో వారి నిశ్చితార్థం రద్దు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాతనే ఆమె నటిగా మరో ఎత్తుకు ఎదిగారు. హీరోయిన్‌గా భారీగా బిజీగా అయ్యారు. నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రేమలో పడిందనే వార్తలు కొత్త కాలంగా గుప్పుమన్నాయి.
అయితే గత కొద్దికాలంగా తెలుగు సినిమా రంగంలో ఓ యువ హీరోతో సన్నిహితంగా ఉంటున్నారనే విషయం మీడియాలో అడపాదడపా చర్చ జరుగుతుంటుంది. అయితే ఆమె తన రిలేషన్‌షిప్ గురించి పెద్దగా మాట్లాడకపోవడం, స్పందించకపోవడంతో వారి మధ్య ఉంది కేవలం ఫ్రెండ్ షిప్ అనే సర్దిపెట్టుకొన్నారు. కానీ వారిద్దరూ ఫారిన్ వెకేషన్‌కు వెళ్లడంతో వారి మధ్య ఏదో ఉందనే విషయంపై క్లారిటీ వచ్చింది.
అయితే తాజాగా చావా సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక తన రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అయ్యారు. తనకు ఒకరితో అఫైర్ ఉందని, తామిద్దరం డేటింగ్ చేస్తున్నామని హింట్ ఇచ్చారు. కానీ ఆమె తన ప్రియుడి పేరును చెప్పకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో కొంత మేరకు కొన్ని రూమర్లకు తెర దించే ప్రయత్నం చేశారు. స్వయంగా ఆమెనే ప్రమోషన్స్‌లో తన డేటింగ్ లైఫ్ గురించి చెప్పడాన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, రష్మిక మందన్న నటించిన చావా చిత్రంలో బాలీవుడ్ యువ హీరో వికీ కౌశల్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, డయానా పెంటీ, దివ్య దత్తా తదితరులు నటిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మడోక్ ఫిలిం బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











