కోటి క్లబ్బులో రష్మిక మందన్న.. డబుల్ ధమాకా
యంగ్ హీరోయిన్ రష్మిక మందన్న స్పీడు చూస్తుంటే త్వరలోనే స్టార్ స్టేటస్ కేట్టేస్తుందని తెలుస్తోంది. 'ఛలో' అంటూ టాలీవుడ్ చిత్రసీమకు పరిచయమైన ఈ కన్నడ భామ వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉంది. ఛలో అంటూ వెళ్తుందే తప్ప కెరీర్‌లో ఎక్కడా వెనుతిరిగి చూసిందేలేదు. నాగశౌర్యతో తొలిసారి రొమాన్స్ చేసిన రష్మిక.. ఆ తర్వాత టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో జత కట్టి 'గీత గోవిందం' రూపంలో భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆమె చేసిన లిప్ లాక్స్, సన్నివేశాలకు తగ్గట్లుగా చూపిన అభినయం అగ్ర దర్శకులు, అగ్ర హీరోల దృష్టిలో పడింది. వెంటనే ఆమెకు అవకాశాల పంట పండింది.
మరోసారి అదే విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమా చేసే అవకాశం దక్కింది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. అలాగే తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమా, యంగ్ హీరో నితిన్ సరసన మరో సినిమా చేస్తున్న రష్మిక.. ఇటీవలే స్టార్ హీరో మహేష్ బాబుతో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. మహేష్ కెరీర్‌లో 26 వ సినిమాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక రోల్ చాలా కీలకంగా ఉండనుందట.

అయితే ప్రస్తుతం ఆమెకున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకొని, మహేష్ బాబు లాంటి బడా హీరోతో నటించే అవకాశం దక్కింది అనికూడా చూడకుండా కోటి రూపాయలకు పైన పారితోషికం ఇవ్వాలని పట్టుబట్టిందట రష్మిక. కాగా రష్మికకు ప్రస్తుతమున్న క్రేజ్ దృష్ట్యా ఆ డిమాండ్ ఓకే చేశారట సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు. దీంతో అతి తక్కువ సినిమాలతోనే కోటి క్లబ్బులో చేరిపోయింది రష్మిక మందన్న. దీన్ని బట్టి చూస్తే ఇటు స్టార్ హీరోయిన్‌గా, అటు కోటి రూపాయల క్లబ్బు రెండిటిలోను ఒకేసారి అడుగుపెట్టి డబుల్ ధమాకా దిశగా రష్మిక ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగి డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు హిట్ అయ్యిందంటే ఇక ఆమెకు తిరుగే ఉండదు మరి.


Click it and Unblock the Notifications











