ఖాళీ టైంలో అలాంటి పనులే చేస్తా.. రష్మిక మందన్న మామూల్ది కాదు!
రష్మిక మందన్న సోషల్ మీడియాలో చేసే చేష్టలకు అందరూ ఫిదా అవుతుంటారు. చిన్న పిల్లలా ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు పడిపోతోంటారు. నేషనల్ క్రష్‌గా రష్మిక మందన్న ఎంపికైందంటే ఆమె క్రేజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ పరిశ్రమలో నటిగా జీవితాన్ని ప్రారంభించినా కూడా స్టార్‌ను చేసింది మాత్రం టాలీవుడ్. అతి తక్కువ కాలంలో, చేసిన కొన్ని సినిమాలతోనే స్టార్ స్టేటస్ అందుకుంది.

చిలిపి పనులు..
ఇక సోషల్ మీడియాలో రష్మిక చేసే చేష్టలకు అందరూ పడిపోతుంటారు. క్యూట్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ కట్టిపడేస్తుంటుంది. చిన్ని నవ్వుతోనే కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టేస్తోంది. అలా రష్మిక చేసే ఫోటో షూట్లు నెట్టింట్లో ఇట్టే వైరల్ అవుతుంటాయి.

ట్రోలింగ్ కూడా..
రష్మికకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఎదురవుతుంటుంది. కానీ ఆమె దాన్ని అంత సీరియస్‌గా తీసుకోదు. ఆ మధ్య భీష్మ సినిమా ప్రమోషన్స్‌లో కుక్క బిస్కెట్లు తిన్నదంటూ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. కేవలం టేస్ట్ ఎలా ఉంటుందో చూశాను అని కవర్ చేసినా కూడా ఆమెను ఆడేసుకున్నారు.

ప్రస్తుతం అలా..
ప్రస్తుతం రష్మిక మందన్న క్రేజ్ నేషనల్ వైడ్‌గా పెరిగింది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది. సిద్దార్థ్ మల్హోత్ర హీరోగా రాబోతోన్న ఈ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది.

నైట్ షూటింగ్‌లు..
మామూలుగా రష్మిక గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పొలం దున్నుతున్న వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. సుల్తాన్ సినిమా కోసం నిజంగానే పొలం పనులు చేయడంతో రష్మికపై ప్రశంసలు కురిపించారు. ఇక ప్రస్తుతం రష్మిక అయితే మిషన్ మజ్ను కోసం రాత్రి పూట కూడా షూటింగ్‌లు చేస్తోంది.

తాజాగా అలా..
అయితే రాత్రంతా షూటింగ్ చేసి అలిసిపోయిన రష్మిక తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. తనకు దొరికిన ఈ ఖాళీ సమయంలో ఇలాంటి పిచ్చి పనులు చేస్తాను అని సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో రష్మిక తన కళ్లు మూసుకుని వెరైటీ పోజులను పెట్టేసింది. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











