రష్మిక మందన్నా సరికొత్త రికార్డ్.. తొలి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఘనత.. వాళ్లని వెనుకకు నెట్టి మరి!

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఛలో సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ కన్నడ బ్యూటి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఫలితంగా వరసుగా సౌత్, నార్త్ సినిమాలతో దూసుకుపోతోంది. సినిమాలు, పలు బ్రాండ్స్ కు అడ్వర్టైజ్ మెంట్స్ తోనే కాకుండా తాజాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఛలో సినిమాతో:'ఛలో' అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది కన్నడ బ్యూటి రష్మిక మందన్నా. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంది ఈ బ్యూటి. విజయ్ దేవరకొండతో నటించిన 'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాకుండా ఈ సినిమాతో ఆమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది.

Rashmika Mandanna Creates New Record In Instagram With 38 Million Followers

దేశవ్యాప్తంగా క్రేజ్:'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప', 'సీతా రామం', 'వారసుడు' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది ఈ కన్నడ చందం రష్మిక మందన్నా. ఇదే కాకుండా హిందీలోనూ సత్తా చాటుతోంది ఈ బ్యూటి. గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ నటించి ఆకట్టుకుంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. ఇందులో శ్రీవల్లిగా యావత్ సినీ ప్రేమికులను అట్రాక్ట్ చేసింది.

Rashmika Mandanna Creates New Record In Instagram With 38 Million Followers

కొత్త దర్శకుడితో:రష్మిక ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో పాటు రెయిన్ బో అనే సినిమాతో ఫుల్ బిజీగా ఉంది. మహిళా ప్రాధాన్యత గల చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో శాకుంతలం మూవీ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. రష్మిక మందన్నా కెరీర్ లోనే ఇది తొలి ఫీమెల్ ఒరియెంటెడ్ చిత్రంగా నిలవనుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు శాంతరూబన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

Rashmika Mandanna Creates New Record In Instagram With 38 Million Followers

గొప్ప రికార్డ్:ఇదిలా ఉంటే సినిమాలతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్నా తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తన అకౌంట్ లో మొత్తంగా 38 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకుని గొప్ప రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో తెలుగులోనే అత్యధికంగా ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్లు కలిగిన హీరోయిన్ గా రష్మిక ఘనత సాధించింది.

Rashmika Mandanna Creates New Record In Instagram With 38 Million Followers

వాళ్లను వెనక్కి నెట్టి:సమంతకు 26.4, కాజల్ అగర్వాల్ 25.4, పూజా హెగ్డే 23.5, శ్రుతి హాసన్ 22.9, తమన్నా 20.7, కీర్తి సురేష్ 15.2 ఫాలోవర్లు కలిగి ఉన్నారు. అంటే స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్స్ అయిన సమంత, కాజల్ అగర్వాల్, తమన్నాలను సైతం వెనక్కి నెట్టి మరి ఘనత సాధించి నిజంగానే నేషనల్ క్రష్ అనిపించుకుంది రష్మిక మందన్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X