దర్శకుడు చేసిన పనికి ఏడ్చేశా.. షాక్ నుంచి చాలా సేపు బయటపడలేకపోయా.. రష్మిక!
రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. ఛలో చిత్రంలో చలాకి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ప్రవేశించిన రష్మీక ఆ తర్వాత గీత గోవిందం చిత్రంతో యువతని మాయ చేసింది. రష్మిక గ్లామర్ కు కుర్ర కారు ఫిదా అయ్యారు. దీనితో రష్మిక ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటోంది. గీతా గోవిందం చిత్రంలో రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా నటించారు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా జరిగిన ఆసక్తికర సంఘటనని రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కెమిస్ట్రీ హాట్ టాపిక్
గీత గోవిందం చిత్రంలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరిద్దరి గురించి అనేక రూమర్లు వినిపించాయి కూడా. గీతా గోవిందం చిత్రం గత ఏడాది విడుదలై రికార్డు స్థాయిలో దాదాపు 70 కోట్ల షేర్ కొల్లగొట్టింది. రొమాంటిక్ గా సాగే కథ, గోపిసుందర్ సంగీతం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశాలు. ఈ చిత్ర సెట్స్ లో దర్శకుడు పరుశురాం తనని కంట తడి పెట్టించాడని ఆ సంఘటనని గుర్తు చేసుకుంది.

షూటింగ్‌కు ఆలస్యంగా
ఓ రోజు గీతా గోవిందం షూటింగ్ కు కాస్త ఆలస్యంగా వెళ్ళా. అప్పటికే దాదాపుగా అందరూ సెట్స్ కు చేరుకొని ఉన్నారు. నేను షూటింగ్ కు వెళ్లగానే నన్ను చూస్తూ అంతా మౌనంగా ఉండిపోయారు. నేను పలకరించినా తిరిగి ఎవరూ నాతో మాట్లాడలేదు. అంతా ఏదో జరిగిపోయినట్లు నాతో మాట్లాడకుండా ప్రవర్తించారు. దీనితో కాసేపటికి నా మనసులో బాధ ఆగలేదు. ఏడుస్తూ కూర్చుండిపోయా. అయినా ఎవరూ ఓదార్చడానికి రాకవపోవడంతో నేను ఏదో చేయరని నేరం చేశాననే ఫీలింగ్ కలిగింది. ఏడుపు ఇంకా ఎక్కువైంది.. ఆ సమయంలో దర్శకుడు పరశురామ్ అసలు విషయం వెల్లడించారు.

నిజంగా ఏడిస్తే
ఇదంతా తాము సరదాకు ప్లాన్ చేశాం అని పరశురామ్ అన్నారు. నేను నిజంగా ఏడిస్తే ఎలా ఉంటుందో షూట్ చేయడానికి ఈ తతంగం మొత్తం చేశారని రష్మిక తెలిపింది. దర్శకుడు ఈ విషయాన్ని నాతో చెప్పిన తర్వాత కూడా చాలా సేపు షాక్ నుంచి బయటకు రాలేకపోయా అని రష్మిక గుర్తు చేసుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన గీత గోవిందం చిత్రం 2018 బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

క్రేజీ ఆఫర్లు
ప్రస్తుతం రష్మిక డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండతో మరోసారి రొమాన్స్ చేస్తోంది. డియర్ కామ్రేడ్ చిత్ర టీజర్ లో రష్మిక, విజయ్ దేవరకొండ ముద్దు సన్నివేశం ఇప్పటికే వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. నితిన్ సరసన భీష్మ చిత్రంలో నటించనుంది. తమిళంలో కార్తీ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. అఖిల్ తదుపరి చిత్రంలో రష్మిక హీరోయిన్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రష్మిక మందన క్రమంగా టాలీవుడ్ లో టాప్ లీగ్ హీరోయిన్ల జాబితాలో చేరుకుంటోంది.


Click it and Unblock the Notifications











