విజయ్ దేవరకొండతో పెళ్లి.. రూమర్లకు చెక్ చెప్పేలా మౌనం వీడిన రష్మిక!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస హిట్లతో ఇండియన్ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. అయితే గత కొద్దికాలంగా ఆమె డేటింగ్ లైఫ్ గురించి జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వినిపించాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో సన్నిహితంగా ఉండటంపై అనేక ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. తమపై వస్తున్న రూమర్లు, ఊహాగానాలపై విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో అది ప్రశ్నగానే ఉండిపోయింది. అయితే తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లిపై నర్మగర్భంగా ఓ కామెంట్ చేసి చిన్న లీక్ ఇచ్చింది. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళితే..

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాతో విజయ్ దేవరకొండతో ప్రారంభమైన ప్రయాణం.. పలు సినిమాల్లో కలిసి నటించారు. వారిద్దరి మధ్య జరిగిన పరిచయం వారిని మరింత సన్నిహితంగా చేసింది. అప్పటి నుంచి వారిద్దరూ కూడా లంచ్ డేట్స్, డిన్నర్ డేట్స్‌తో ముంబై వీధుల్లో ఇద్దరు కలిసి మీడియాకు కనిపించడం స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

Rashmika Mandanna

అయితే ఇలాంటి రూమర్ల మధ్య రష్మిక మందన్న ఎంగేజ్‌మెట్ వ్యవహారం మీడియాలో గుప్పుమన్నది. అక్టోబర్ 3వ తేదీన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ అఫైర్‌గా హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఈ వార్తను నర్బగర్భంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఇటీవల హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు రష్మిక మందన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నిశ్చితార్థం గురించి అవును అని గానీ.. కాదు అని గానీ ఖండించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు నేను అధికారికంగా ప్రకటిస్తాను అని ఆమె అన్నారు. దాంతో ఆమె తన వ్యక్తిగత విషయంగానే దానిని పరిగణించి సీక్రెట్‌గానే ఉంచే ప్రయత్నం చేశారు.

ఇక పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై కూడా అదే విధంగా స్పందించారు. మ్యారేజ్ గురించి అవును అనీ గానీ.. కాదు అనీ గాని నేను చెప్పలేను. ఆ విషయం గురించి చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేను మీడియాకు తెలియజేస్తాను. అంతకుమించి నా పెళ్లి గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను అని ఆమె అన్నారు.

ఇదిలా ఉండగా, రష్మిక మందన్న పెళ్లి వార్తలు మీడియాలో గుప్పుమంటూనే ఉన్నాయి. విజయ్‌తో పెళ్లి ఫిబ్రవరిలో జోధ్‌పూర్‌లో గానీ.. లేదా జైపూర్‌లో గానీ జరుగవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె పెళ్లికి కావాల్సిన షాపింగ్ కూడా మొదలుపెట్టారు. జోధ్‌పూర్ వెళ్లి పెళ్లి వేదికకు సంబంధించిన విషయాలను పరిశీలించి వచ్చారు అని తెలుస్తున్నది.

రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆమె తన ప్రొఫెషనల్ జర్నీని కొనసాగిస్తున్నారు. యానిమల్, ఛావా లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గానే కాకుండా బాలీవుడ్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా మారిపోయారు. తాజాగా ఆమె నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం కూడా ప్రశంసలతోపాటు మంచి విజయాన్ని అందుకొన్నది. త్వరలోనే విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మరో చిత్రంలో నటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X