చాలా బాధగా ఉంది.. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటున్న రష్మిక

రష్మిక మందాన (Rashmika Mandanna) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ నుంచి టాలీవుడ్‌కి వచ్చిన రష్మిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఆమెను 'నేషనల్ క్రష్'గా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్ సంపాదించుకుని, బాలీవుడ్‌లో కూడా రష్మిక దుమ్మురేపుతోంది. తాజాగా చాలా బాధగా ఉంది.. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్ మీడియాలో సీరియస్ ట్విట్ పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

రష్మిక మందన్న 2023 నవంబర్‌లో డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. అప్పట్లో ఆ వీడియో నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియక చాలా మందిలో గందరగోళం ఏర్పడింది.ఆ ఘటన తర్వాత రష్మిక మానసికంగా ఎంతగా ప్రభావితమయ్యారో అప్పుడే ప్రకటించారు. ఆ సంఘటన నుంచి ఇప్పటి వరకు చాలామంది ఇలాంటి దాడుల పడుతున్నారు. AIపై అవగాహన పెంచుతూ, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు.

Rashmika Mandanna Demands Strict Action Against Deepfake Abuse

అదిలాఉంటే.. రష్మిక మందన్న మరోసారి డీప్‌ఫేక్ దుర్వినియోగంపై ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రష్మిక తన పోస్ట్‌లో డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల నేడు అసత్యాన్ని సృష్టించడం చాలా సులభమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ సాంకేతికతను అభివృద్ధి కోసం ఉపయోగించాల్సింది పోయి, మహిళలను అవమానించడం కోసం వాడుతున్న వారిపై రష్మిక ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారిక హ్యాండిల్ 'సైబర్‌దోస్త్'ను ట్యాగ్ చేస్తూ ఆమె రాసిన పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాజా పోస్ట్‌లో రష్మిక నేరుగా ఇండియా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (Cyber Dost) అధికారిక హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. ఇది కేవలం వ్యక్తిగత బాధ కాదు. డీప్‌ఫేక్ టెక్నాలజీని ఆయుధంగా మార్చి మహిళలను లక్ష్యంగా చేసుకునే క్రైమ్‌లు పెరుగుతున్నాయనే సంకేతం అని ఆమె తెలిపింది. సాంకేతికతను తప్పుగా ఉపయోగించే వారిని కఠినంగా శిక్షించాలి' అని డిమాండ్ చేశారు.

ఇది ఒక్క రష్మిక సమస్య మాత్రమే కాదు. ఇండస్ట్రీ మొత్తాన్ని తాకిన విపత్తు.. ఇటీవల నటి కీర్తి సురేష్ కూడా తన మార్ఫ్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘాటుగా స్పందించారు. సాంకేతిక అభివృద్ధి వల్ల ఆన్‌లైన్ వేధింపులు పెరుగుతూ, మహిళల గౌరవం, మానసిక ఆరోగ్యం నాశనం అవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలోపార్లమెంట్‌లోనే బీజేపీ ఎంపీ హేమమాలిని డీప్‌ఫేక్ ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ.. ఇది సమాజంలో గౌరవ మర్యాదలను కూలగొట్టే ప్రమాదకర ఆయుధం అని హెచ్చరించారు. అంతకు ముందు అమితాబ్ బచ్చన్, కాజోల్ వంటి తారలు కూడా డీప్‌ఫేక్ దాడులపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమంత, రష్మిక, కీర్తి వంటి హీరోయిన్స్ పబ్లిక్ ఫిగర్స్ అయినప్పటికీ, ఈ దాడుల కారణంగా వ్యక్తిగత గౌరవం, మానసిక భద్రత తీవ్రంగా దెబ్బతింటోంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X