నాపై కోపం కలిగితే.. సీతారామంలో నేనే విజేతను.. రష్మిక మందన్న ఎమోషనల్

సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో రూపొందిన చిత్రం సీతారామం. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన కీలక పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో సీతారామం థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, రమేష్ ప్రసాద్, నిర్మాత అశ్వినీదత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ..

సీతారామం సినిమాలో అఫ్రిన్ పాత్ర అనుకున్నపుడు రష్మిక మందన్న ఫస్ట్ ఛాయిస్‌గా కనిపించారు. సీత పాత్రలో మరొకరిని ఉహించుకుంటానేమో కానీ అఫ్రిన్ పాత్ర చేయడానికి మరో హీరోయిన్ ఆప్షన్ లేదు. ఇద్దరు వ్యక్తులను, ఇద్దరి మనసులను కలిసేలా చేసే మనిషిని అద్భుతం అంటాం. రష్మిక గారి ఆఫ్రిన్ పాత్ర కూడా ఒక అద్భుతం. ఇది రామాయణం కథకు కనెక్ట్ చేస్తే.. రష్మిక పాత్రను హనుమంతుడు పాత్రతో పోల్చి చూసుకోవచ్చు. రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంత గొప్పదో సీతారామం సినిమాలో ఆఫ్రిన్‌గా రష్మిక పాత్ర అంత ఉన్నతమైనది అని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.

Rashmika Mandanna emotional about Afreen role in Sita Ramam

సీతారామం సినిమాలోని అఫ్రిన్ పాత్ర గురించి రష్మిక మాట్లాడుతూ.. దర్శకుడు హను నాకు ఒక రెబెల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ పాత్రకు ఎలా న్యాయం చేయాలని దర్శకుడు హను రాఘవపూడిని అడిగాను. ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే నా పాత్రకు న్యాయం చేశాననిపిస్తుంది. ఒక అందమైన ప్రేమ కథ చెప్పాడానికి కథకుడు ఉండాలి. కథ ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి కదా.. ఇందులో ఆ వివరాలని నేను ఇస్తా. సీత, రామ్ అందమైన ప్రేమ కథని అఫ్రిన్ చెప్పే విధానం మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆగస్ట్ 5న రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నారు.

Rashmika Mandanna emotional about Afreen role in Sita Ramam

అఫ్రిన్ అనే రెబల్ పాత్ర చేయమని అడిగినప్పుడు, నా వల్ల అవుతుందా అని దర్శకుడు హనుని అడిగా. ఇప్పటి వరకు పోషించిన రోల్స్‌లో నేను యాంగ్రీ బర్డ్‌గా కనిపించాను. కానీ అందులో కూడా అమాయకత్వం ఉంటుంది. కానీ అఫ్రీన్ పూర్తిగా రెబల్ రోల్. ఐతే ఇది అద్భుతమైన ప్రేమ. ఇందులో నా పాత్ర రామ్, సీత ప్రేమ కథ చుట్టు తిరుగుతుంది. ఇది నాకు చాలా కొత్త పాత్ర. నా పాత్రపై ఆడియన్స్‌కి కోపం వస్తే.. నా ఎమోషన్స్‌తో ప్రేక్షకుడు కనెక్ట్ అయితే నేను విజేతగా నిలిచినట్టే అని రష్మిక మందన్న అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X