డియర్ కామ్రేడ్‌పై రివ్యూలు చదువుతుంటే.. రష్మిక మందన ఎమోషనల్
దక్షిణాది అందాల తార రష్మిక మందన్న ఖాతాలో మరో హిట్టు పడింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మికకు డియర్ కామ్రేడ్ సక్సెస్ మరింత జోష్ నింపింది. ఈ సినిమాకు వస్తున్న టాక్‌ను చూసి హ్యాపీగా ఫీలయ్యానని శనివారం నిర్వహించిన డియర్ కామ్రేడ్ ప్రెస్‌మీట్‌లో రష్మిక తన భావాలను పంచుకొన్నారు. శుక్రవారం (జూలై 26న) రిలీజైన డియర్ కామ్రేడ్ భారీ కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రష్మిక మాట్లాడుతూ..

మొదటి నుంచి గట్టిగా నమ్మాను
డైరెక్టర్ భరత్ కమ్మ కథ చెప్పినప్పటి నుంచి చాలా గట్టిగా నమ్మాను. అదే ఇప్పటి వరకు కంటిన్యూ అయింది. నేను ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పాను. ఇప్పుడే అదే రుజువు అయింది. డియర్ కామ్రేడ్ చేయడం గర్వంగా ఉంది. సినిమా చూసిన వారందరూ కనెక్ట్ అయ్యాం. ఈ అవకాశం ఇచ్చిన భరత్ కమ్మకు నా థ్యాంక్స్. నిర్మాతలు, ఇతర టెక్నికల్ డిపార్ట్‌మెంట్ పనిచేసిన ప్రతీ ఒక్కరిని మిస్ అవుతున్నానని బాధగా ఉంది అని రష్మిక మందన్న అన్నారు.

రివ్యూలు చదువుతుంటే..
నా కెరీర్‌లో డియర్ కామ్రేడ్ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ రోజు రివ్యూలు చదువుతుంటే చాలా సంతోషం కలిగింది. అందరూ కనెక్ట్ అయ్యామని చెబుతుంటే ఇంకా సంతోషంగా ఉంది. నా కెరీర్ మరో అడుగు ముందేయడానికి కారణమై వేదిక మీద ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్. నా కెరీర్ ఆరంభంలో ఇలాంటి సినిమాను అందించిన భరత్ కమ్మకు థ్యాంక్స్ అని రష్మి అన్నారు.

విజయం వెనుక ప్రతీ ఒక్కరి శ్రమ
డియర్ కామ్రేడ్ సినిమా పనిచేసిన ప్రతీ ఒక్కరిని మిస్ అవుతున్నానే బాధను సోషల్ మీడియాలో పెట్టాను. ఈ విజయం వెనుక ప్రతీ ఒక్కరి శ్రమ ఉంది రష్మిక అన్నారు. నేను ఎంతగా మిస్ అయ్యాననే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు. ఈ సినిమాతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరితో చాలా మంచి బంధం ఏర్పడింది. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది అని రష్మిక అన్నారు.

అందరి ముఖంలో చిరునవ్వులతో
డియర్ కామ్రేడ్ సినిమా బ్లాక్‌బస్టర్ అయిందనే టాక్ వింటుంటే, అందరి ముఖంలో చిరునవ్వులు చేస్తుంటే మేము పడిన శ్రమకు ఫలితం దక్కిందనే విషయం అర్ధమవుతున్నది. ఈ సినిమాను ఇంతగా ప్రమోట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ పిక్చర్స్ యష్ రంగినేని గారికి థ్యాంక్స్ అని రష్మిక అన్నారు.


Click it and Unblock the Notifications











