ప్రతీ రోజు చివరి రోజే: ఫారీన్ టూర్‌లో రష్మిక ఎమోషనల్ పోస్ట్.. విజయ్ దేవరకొండను పట్టేసిన నెటిజన్లు!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏప్రిల్ 5వ తేదీన తన జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నది. ఈ పుట్టిన రోజు వేడుకను తన సన్నిహితులతో కలిసి విదేశాల్లో జరుపుకోవడం విశేషం. పుష్ప 2 రిలీజ్‌కు ముందు వచ్చిన బర్త్ డేను జీవితంలో గుర్తుంచుకొనే విధంగా ఆస్వాదించింది. విదేశీ పర్యటనలో దిగిన ఫోటోలను, వీడియోలను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ అభిమానులను ఆనందానికి గురి చేయడమే కాకుండా నెటిజన్లను అనేక సందేహాలకు గురి చేసింది. అయితే ఫారిన్ ట్రిప్‌లో ఉన్న ఆమె ఓ ఎమోషనల్ పోస్టుతో అభిమానులను పలుకరించింది. ఈ పోస్టులో ఏమున్నదనే వివరాల్లోకి వెళితే..
ప్రతీ రోజు అదే నీ చివరి రోజు అనుకొని జీవించాలి. ఈ మాటలు మీకు బోరింగ్ కోట్స్‌గా అనిపించవచ్చు. కానీ ప్రతీ రోజు మన ఖర్చులు, బిల్లులు చెల్లింపుకు మనం సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టాలి. ఇండస్ట్రీలో, సమాజంలో గౌరవాన్ని సంపాదించుకోవాలి. కలలు, లక్ష్యాలను చేరుకోవాలి. అందుకు కష్టపడి పనిచేయాలి. డెడ్ లైన్స్ ముందు అసైన్‌మెంట్స్ పూర్తి చేయాలి. కష్టించి చదవాలి అని వేదాంతం చెప్పింది.

క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలనే తాపత్రయం, డబ్బు బాగా సంపాదించాలి, సంపదతో ఉండాలనే కోరికతో మన ప్రయాణం సాగుతుంది. అలాగే జీవితంలో మంచి కారు, మంచి ఇల్లు, బెస్ట్ కాలేజీలో సీటు పంపాదించాలి. చదువుకోవడానికి స్కాలర్ షిప్ అందుకోవాలి. ఇలాంటి కోరికలతో అందరి జీవితాలు సాగుతాయి. ఈ పోరాటంలో మనకు జీవితంలో ఏది ముఖ్యమనే విషయం మరిచిపోతాం అని తన పోస్టులో తెలిపింది.
లైఫ్‌లో మనం కోరుకొన్నది సాధించడానికి బాగా కష్టపడుతున్నామని అనుకొంటాం. అందుకోసం మన సంతోషాన్ని పక్కన పెడుతాం. ఇవన్నీటికి అతీతంగా మా గోల్‌ను పక్కన పెట్టం. ప్రతీసారి ఏదో కావాలని టార్గెట్ పెట్టుకొంటాం. అందుకే మనల్ని మానవులు అంటారు అని తన పోస్టులో పేర్కొన్నారు.
ఉన్నత శిఖరాలను ఆధిరోహించడం, లక్ష్యాలను చేరుకోవడం, డబ్బు సంపాదించడం జీవితంలో అన్నీ ముఖ్యమే. కానీ ప్రస్తుతం మనం ఎలా జీవిస్తున్నామన్నది కూడా ముఖ్యమే. అందుకే మనకు ఏం కావాలో దానిని గుర్తుంచుకోవాలి అని రష్మిక మందన్న పెద్ద వ్యాసమే రాసింది.
రష్మిక మందన్న పెట్టిన పోస్టుపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. బర్త్ డే విషెస్ చెబుతూ కొందరు.. చాలా అందంగా ఉన్నావని మరికొందరు కామెంట్లతో విషెస్ తెలిపారు. అయితే కొందరు తుంటరి నెటిజన్లు మాత్రం.. విజయ్ దేవరకొండ ఫోటోలు మాత్రం బాగా తీశాడు. ఆయన మంచి ఫోటోగ్రాఫర్ అంటూ కితాబిస్తున్నారు.


Click it and Unblock the Notifications











