నిన్న మహల్‌పై, నేడు తండ్రిపై.. రష్మికలోని మరో కోణం
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందాన్న.. తనలోకి ప్రతిభను అందరికీ ప్రదర్శిస్తోంది. రెండ్రోజుల క్రితం ఓ మహల్ గురించి అందంగా వివరించి అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా తన తండ్రిపై ఉన్న ప్రేమను, తండ్రికి తనపై ఉన్న ప్రేమను అందంగా రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ తండ్రీ కూతుళ్ల ప్రేమకు ఫిదా అవుతున్నారు.
ఇంతకీ ఆమె తన తండ్రి గురించి ఏం చెప్పిందంటే.. 'డాడ్స్ .... ఆహ్, నేను ఏమి చెప్పగలను .. నేను పుట్టడానికి రెండు రోజుల ముందు.. ఆయన ఓ కల కన్నానని చెప్పాడు. పొడవాటి జుట్టు, పెద్ద కళ్ళు, పొడవైన ముక్కు, చిట్టి చిట్టి పాదాలతో తన మీద నాట్యం చేసే శిశువును ఊహించుకున్నాడట. అయితే నా చిన్నతనంలోఆయన ఎప్పుడూ వ్యాపార పనుల్లో ఉండటంతో నాతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత నా జీవితంలో ఎక్కువ భాగం హాస్టల్‌లో ఉండాల్సి వచ్చింది.

యూజీ పీజీ అంటూ దూరంగా ఉన్నాను.. ఆపై నేను సినిమాల్లోకి వచ్చాను. ఇప్పుడు నేను మా తండ్రి వ్యాపారంలో భాగస్వామిని. ఆయనెప్పుడూ నాకు పిల్లర్‌లా అండగా నిలిచారు. మేము ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకుంటాము. మా తండ్రికి నేను నాకు మా తండ్రికి పిలర్‌ను. మా తండ్రి నా వాడే. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే... తండ్రికి కూతుళ్లకు గ్యాప్ ఉంటుందని మీలో చాలా మంది అనుకుంటారు. కానీ విషయం ఏమిటంటే, వారి మనసులో ఏముందో మీరు చూడగలిగితే .. మీరు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారు. వారు మాకు ఉత్తమమైనదాన్ని కోరుకుంటారు కాబట్టి కొన్ని సార్లు మన ఇష్టాలను వ్యతిరేకిస్తార'ని ఓ సుధీర్ఘమైన పోస్ట్‌ను చేసింది.


Click it and Unblock the Notifications











