twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rashmika Mandanna: గుండె ముక్కలయ్యింది, పరిస్థితి దిగజారిపోతోంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ వైరల్

    |

    బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రష్మిక మందన్న సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఆమె తన స్థాయిని పెంచుకునే విధంగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. అయితే ఇటీవల కాలంలో ఆమె సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ట్రోలింగ్స్ పై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. చాలా బాధ కలిగించింది అని ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా తెలియజేయడం వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

    రష్మిక రియాక్షన్

    రష్మిక రియాక్షన్

    గతంలోనే చాలాసార్లు రష్మిక మందన్న సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి స్పందించే ప్రయత్నం చేసింది. ఒక విధంగా అర్థవంతమైన విమర్శలను నేను ఎప్పటికీ స్వాగతిస్తాను అని కూడా ఆమె తెలియజేసింది. ఎందుకంటే తన కెరీర్ కు అవి ఎంతగానో ఉపయోగపడతాయని కూడా ఆమె తెలియజేసింది. కానీ కావాలని పనిగట్టుకుని నీచమైన మాటలతో ట్రోలింగ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు అని రష్మిక ఇన్స్టాగ్రామ్ లో ఒక వివరణ అయితే ఇచ్చారు.

    నెగటివ్ ట్రోల్స్

    నెగటివ్ ట్రోల్స్

    చాలాకాలంగా కొన్ని విషయాలపై మాట్లాడాలని అనుకుంటున్నాను. కొన్ని పరిస్థితులు తనను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు అందుకే వాటి గురించి మాట్లాడాలని అనుకున్నాను. నా సినిమా కెరిర్ మొదలైనప్పటి నుంచి కూడా ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాను. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ ట్రోల్స్ నన్ను చాలా బాధగా గురి చేశాయి.. అని రష్మిక తెలియజేసింది.

    ఎన్నో జాగ్రత్తలు

    ఎన్నో జాగ్రత్తలు

    కొంతకాలం తర్వాత ట్రోలింగ్ పై నాకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నేను అందరికీ నచ్చాలని లేదు. ఎందుకంటే ఇక్కడ అలాంటి మార్గాలు ఉన్నాయి కాబట్టి అన్నిటినీ ఎదుర్కోవాలి అనుకున్నాను. అదే విధంగా ప్రతి ఒక్కరి ప్రేమను కూడా పొందాలని అనుకోలేదు. ఒక విధంగా నాకు మిమ్మల్ని హ్యాపీ చేయాలని ఆలోచనతోనే ప్రతిరోజు కష్టపడి సినిమాలో నటిస్తూ ఉంటాను. ఒక విధంగా గర్వించే విధంగానే నటనలో రాణించాలని ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటాను.. అని రష్మిక తెలిపింది.

    వ్యతిరేకంగా

    వ్యతిరేకంగా

    అయితే ఇంత కష్టపడుతున్నా కూడా కొన్నిసార్లు ఊహించిన విధంగా విమర్శలు వస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో నేను స్పందించని విషయాల గురించి కూడా నన్ను హేళన చేస్తూ కామెంట్ చేస్తున్నారు. అలాంటి వాటిని చూసినప్పుడు నా గుండె ముక్కలైన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఇంటర్వ్యూలలో నేను మాట్లాడిన విషయాలు కూడా నాకు వ్యతిరేకంగా మారినట్లు అనిపించింది. ఇక కావాలని తప్పుడు ప్రచారాలు చేయడంతో తనకు మాత్రమే కాకుండా నా సన్నిహితులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది.. అని రష్మిక పేర్కొంది.

    మరింత దిగజారిపోయింది

    మరింత దిగజారిపోయింది

    విమర్శలను ఏమాత్రం పట్టించుకోకూడదు అని ఎంతో కాలం నుంచి అనుకున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఒక విధంగా సోషల్ మీడియా నెగిటివ్ గురించి మాట్లాడి నేను ఇతరుల మీద ఏదో సాధించానని అనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇతరులను చూసి ఎన్నో నేర్చుకున్నాను అభిమానులను ప్రేమను చూసే నేను ఇంతవరకు వచ్చాను. అలాగే ప్రతి ఒక్కరితో కూడా మానవత్వంతో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అందరం కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని.. రష్మిక ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది.

    English summary
    Rashmika Mandanna emotional post on trolling and social media negativity
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X