దాన్ని ఇలా కూడా తాగుతారా?.. రష్మిక వీడియో వైరల్
రష్మిక మందాన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె షేర్ చేసే వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అల్లరి పిల్లగా రష్మిక చేసే పనులు ఫాలోవర్లను అట్రాక్ట్ చేస్తుంటాయి. లాక్డౌన్ సమయంలోనూ రష్మిక ఫుల్ యాక్టివ్‌గా ఉంది. రకరకాల పోజులతో ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆక్టట్టుకుంది. ఈ ఏడాదిలో రష్మిక జోరు బాగానే కొనసాగింది. మొదటి రెండు నెలలు సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో సందడి చేసింది.
ఆ తరువాత లాక్డౌన్ మొదలవ్వడంతో సోషల్ మీడియాలో సందడి చేసింది. అభిమానులతో చిట్ చాట్ చేయడం, వెరైటీ ఫోటో షూట్లు చేయడం వంటి వాటితో రష్మిక జోరు బాగానే కొనసాగింది. మరీ ముఖ్యంగా ఉపాసనతో యువర్ లైఫ్ కోసం చేసిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు బాగానే వైరల్ అయింది. పంది మాంసం తింటామని, పడుకునే ముందు రెండు పెగ్గులు వేస్తామని చెప్పడం బాగానే సెన్సేషనల్ అయింది.

ఇక తాజాగా రష్మిక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా సందడి చేయడం ప్రారంభించింది. తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి రచ్చ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన గ్యాంగ్‌తో కలిసి రష్మిక రచ్చ రచ్చ చేసిన వీడియోలు బాగా హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రష్మిక కాఫీని తాగుతూ వింత ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తోన్న వీడియోను ఆమె స్నేహితురాలు షేర్ చేసింది. అదేమైనా గానీ డ్రింక్ మాత్రం మరీ దారుణంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. రష్మిక ప్రస్తుతం పుష్ప, సుల్తాన్ సినిమాలతో పలకరించేందుకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











