రష్మికకు చేదు అనుభవం.. అండగా నిలిచిన కృతి సనన్!

ఇటీవల సినీ తారలు పబ్లిక్ ఈవెంట్లు, సినిమా ప్రమోషన్లు, మాల్స్ ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో అభిమానుల అత్యుత్సాహం పెద్ద సమస్యగా మారుతోంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ, కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. సెల్ఫీలు, షేక్‌హ్యాండ్ల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా అదే జాబితాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా చేరింది. ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా అభిమానుల తాకిడితో ఆమె అసౌకర్యానికి గురైంది. వివరాల్లోకెళ్తే..

రష్మిక మందన్నా అప్ కమింగ్ బాలీవుడ్ మూవీ 'కాక్‌టెయిల్ 2'. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. విజయ్ దేవరకొండ తో పెళ్లి తర్వాత వస్తున్న మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్స్ భాగంగా రీసెంట్ గా పూణేలో నిర్వహించిన ఈవెంట్‌ కు రష్మిక కూడా హాజరైంది. కానీ ఎవరు ఊహించని విధంగా రష్మికకి చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల భారీ రద్దీ మధ్య జరిగిన ఈ ఈవెంట్‌లో ఆమెకు అసౌకర్యకర అనుభవం ఎదురవడంతో ఆ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna Faces Fan Rush at Cocktail 2 Event

'కాక్‌టెయిల్ 2' సినిమా జూన్ 19న విడుదల కానున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ మేకర్స్ మహారాష్ట్రలోని పుణెలో ఓ ప్రముఖ మాల్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు హాజరైంది. రష్మిక మందన్నా, కృతి సనన్, షాహిద్ కపూర్‌లను ప్రత్యక్షంగా చూడటానికి వేలాది మంది అభిమానులు అక్కడికి తరలివచ్చారు. మొదట్లో ఉత్సాహంగా సాగిన కార్యక్రమం క్రమంగా అదుపు తప్పింది. అభిమానులు ఒక్కసారిగా భద్రతా బారికేడ్లను దాటి నటీనటుల వైపు దూసుకురావడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.

పరిస్థితి చేయి దాటిపోతుండటంతో భద్రతా సిబ్బంది నటీనటులను వెంటనే బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అభిమానుల రద్దీ కారణంగా రష్మిక మందన్నా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొందరు అభిమానులు షేక్‌హ్యాండ్ పేరుతో ఆమెకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కృతి సనన్ వెంటనే స్పందించి రష్మికకు రక్షణగా నిలిచారు. వైరల్ అవుతున్న వీడియోల్లో కృతి సనన్ రష్మికను గట్టిగా పట్టుకుని, ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భద్రతా సిబ్బందితో కలిసి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అభిమానుల తాకిడిలోనూ రష్మికను జాగ్రత్తగా కాపాడిన కృతి తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఈ ఘటన భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. అంత పెద్ద స్థాయిలో అభిమానులు హాజరవుతారని తెలిసినా, నిర్వాహకులు సరైన క్రౌడ్ మేనేజ్‌మెంట్ చేపట్టలేదని పలువురు విమర్శిస్తున్నారు. కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించడం కూడా చర్చనీయాంశంగా మారింది. సినీ తారల భద్రత విషయంలో మరింత జాగ్రత్తలు అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక 'కాక్‌టెయిల్ 2' విషయానికి వస్తే, 2012లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 'కాక్‌టెయిల్'సినిమాకు ఇది సీక్వెల్. దర్శకుడు హోమి అదజానియా తెరకెక్కించిన ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తోందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X