పాపం రష్మిక.. పొట్టి బట్టలతో చిక్కులు.. అనుకోకుండా కెమెరా కంటికి అందాలు?
టాలీవుడ్ లో సత్తా చాటిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తూ ఉంది. పుష్ప లాంటి సూపర్ హిట్ అందుకున్న రష్మిక ఇప్పుడు అనుకోకుండా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ బారిన పడింది. అంటే ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును ఆమె తాను ధరించిన డ్రెస్ కారణంగా కాస్త ఇబ్బందికర క్షణాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వివరాలు

కన్నడ కస్తూరి
రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో జన్మించింది. ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో ఆ తర్వాత ఎమ్మెస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీలో జర్నలిజం సహా ఇంగ్లీష్ సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. చిన్నప్పటి నుంచి నటన మీద మంచి ఆసక్తి కలిగి ఉన్న రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి మంచి క్రేజ్ సంపాదించింది. అలా ఆమె కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాలో రక్షిత్ పక్కన హీరోయిన్ గా నటించింది.

ఛలో సినిమాతో ఎంట్రీ
ఇక కన్నడలో కిరిక్ పార్టీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ హీరోతో ప్రేమలో పడి ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. ఆ తరువాత ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయి 'గీత గోవిందం' సినిమాతో తెలుగు వారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. అందుకే ఆమె ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని పూర్తిగా సినిమాల మీద ద్రుష్టి పెట్టింది. అలా రష్మిక మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో ఛాన్స్ సంపాదించి స్టార్ హీరోయిన్‌గా నిలబడిపోయింది.

శ్రీవల్లిగా అదుర్స్
రష్మిక మందన్నా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా నటించి తనదైన అందాలు ఆరబోస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, సెలబ్రిటీలు కూడా ఒక్కో సారి మూల్యం చెల్లించవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా ట్రోలింగ్ అలాగే వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ కూడా. ఈ సమస్య బారిన ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పడగా ఇప్పుడు ఒక చాట్ షోలో ఈ వార్డ్‌రోబ్ పనిచేయకపోవడంతో రష్మిక కూడా సమస్యలో చిక్కుకుంది.

ఇబ్బంది పడుతూ
షోలో కనిపించిన సమయంలో, రష్మిక, పసుపు రంగు పొట్టి దుస్తులు ధరించింది. ఆ సమయంలో ఆమె కూర్చునే పొజిషన్‌ను మారుస్తున్నప్పుడు, అనుకోకుండా ఆమె లో దుస్తులు కనపడాల్సి రావడంతో ఆమె ఇబ్బంది పడింది. ఆ సెకన్ల వ్యవధిలోనే కెమెరాలు ఆమెను క్లిక్ మనిపించాయి. రష్మికకు సంబందించిన ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఆమె చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం అవుతున్నా దాన్ని మేము మాత్రం ఉపయోగించాలని అనుకోవడం లేదు. అయితే ఆమె ఫోటోలు వైరల్ అయిన వెంటనే, కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఇంత పొట్టి దుస్తులు ధరించినందుకు ఆమెను టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు.
Recommended Video

వెనుకాడకుండా
ఇక రష్మిక బాలీవుడ్ లోనూ పాగా వేయాలని భావిస్తోంది. ఈ ఏడాది రష్మిక బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. రెండు క్రేజీ చిత్రాల్లో నటించే అవకాశాన్ని ఆమె సొంతం చేసుకుంది. మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాల్లో ప్రస్తుతం రష్మిక నటిస్తోంది. `మిషన్ మజ్ను`లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తున్న రష్మిక.. `గుడ్ బై` చిత్రంలో ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తోనే స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ చిత్రంలో రష్మిక .. అమితాబ్ కూతురిగా కనిపించబోతోంది. ఈ రెండు చిత్రాలు చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక రష్మిక బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లని దక్కించుకు కోవాలంటే గ్లామర్ షో చేయాల్సిందేనని ఫిక్స్ అవడంతో ఆమె అందుకు ఏమాత్రం వెనుకాడడం లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











