రష్మికతో స్టార్ హీరో అసభ్య ప్రవర్తన.. పబ్లిక్‌గా అలా టచ్ చేస్తూ..

కోట్లాది మంది అభిమానులన్న హీరోలు తమ మాటలు, చేతలతో ఎంతోమందికి ఆదర్శంగా ఉండాల్సిందిపోయి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సినిమాల్లో ఆదర్శాలు, మహిళల హక్కుల పట్ల పోరాడే స్టార్లు నిజజీవితంలో మాత్రం మహిళ పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న పట్ల ఓ స్టార్ హీరో పబ్లిక్‌గా అనుచితంగా ప్రవర్తించాడు. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత హనీమూన్, కుటుంబ సభ్యులతో గడిపిన రష్మిక ఆ వెంటనే తన సినిమాలు, షూటింగ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రష్మిక మందన్న కాక్‌టెయిల్ 2, మైసా, రణబాలి సినిమాలలో నటిస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.

Rashmika Mandanna Feels Uncomfortable After Shahid Kapoor s Gesture At Cocktail 2 Event

ఆమె తాజాగా నటిస్తున్న మూవీ కాక్‌టెయిల్ 2. హోమీ అదాజనీయా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మద్దూక్ ఫిలింస్ బ్యానర్‌పై అంకుర్ గార్గ్, లవ్ రంజన్, దినేష్ విజాన్‌లు నిర్మిస్తున్నారు. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, వరుణ్ ధావన్, డింపుల్ కపాడియా, రిసాద్ అజిమ్, ఇషితా దత్తా, రోహిత్ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తుండగా.. లినేష్ దేశాయ్, శాంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జూన్ 19న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మే 17న ముంబైలో ఓ ఈవెంట్ జరగ్గా.. షాహిద్ కపూర్, కృతిసనన్, రష్మిక మందన్న సహా చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ క్రమంలో రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. రష్మిక మైక్ పట్టుకుని మాట్లాడుతుండగా ఆమె పక్కనే నిల్చొన్న షాహిద్ కపూర్ ఒక్కసారిగా రష్మిక భుజంపై చేయి వేశాడు. ఊహించని ఈ ఘటనతో రష్మిక అసౌకర్యానికి, ఇబ్బందికి గురయ్యారు. అయితే షాక్ నుంచి తేరుకున్న రష్మిక వెంటనే షాహిద్ కపూర్ నుంచి చేయి నుంచి తప్పించుకుని పక్కకి జరిగింది.

ఈ ఘటనను మీడియా కెమెరాలు బంధించాయి. అయితే రష్మిక ఏమాత్రం సీరియస్ అవ్వకుండా నవ్వుతూనే పరిస్ధితిని హ్యాండిల్ చేసింది. కానీ ఆమె ముఖం, బాడీ లాంగ్వేజ్ మాత్రం తన అసౌకర్యాన్ని తెలియజేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా షాహిద్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అటు రష్మిక పరిస్ధితిని చాలా చక్కగా హ్యాండిల్ చేశారని మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన తర్వాత రష్మిక తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో తన సహనటి కృతి సనన్ గురించి చెబుతూ ఓ బూతు పదం వాడేయటంతో నాలుకు కరచుకుంది రష్మిక.

కాక్‌టెయిల్ మూవీ ఊహాకు అందని విధంగా ఉంటుంది. కృతి అద్భుతంగా నటించింది. ఆమె చాలా హాట్‌గా ఉంటుందన్న విషయం ప్రపంచానికి తెలుసు.. ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తారు. ఈ సమయంలో ఓ బూతు పదం వాడటంతో వెంటనే గ్రహించిన రష్మిక.. సారీ చెప్పి మీడియా వారు దానిని ఎడిట్ చేయాల్సిందిగా కోరింది. ఇప్పటి వరకు మీరు చూడని విధంగా అప్‌డేట్స్ ఉంటాయి. వాటి కోసం నేను కూడా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాను. ఇక మాకు, షాహిద్‌కు మధ్య కెమెస్ట్రీ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని రష్మిక వెల్లడించారు.

Read more about: rashmika mandanna shahid kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X