twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మిక మందన్నాకు చేదు అనుభవం.. బూతు మాటలతో పోస్ట్.. తాటతీసిన కన్నడ భామ!

    By Manoj
    |

    రష్మిక మందన్నా.. అందం, అభినయంతో రాణిస్తున్న హీరోయిన్. సైలెంటుగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా.. ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది. ఇటీవల విజయ్ దేవరకొండతో 'డియర్ కామ్రేడ్' అనే సినిమా చేసింది. ఇది మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఇందులో రష్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె చేసిన లిల్లీ అనే క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇలాంటి పరిస్థితిల్లో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది.

    కన్నడ పిల్ల ఫుల్ బిజీ

    కన్నడ పిల్ల ఫుల్ బిజీ

    కన్నడ పిల్ల రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'తో పాటు నితిన్‌తో ‘భీష్మ' అనే సినిమాల్లో నటిస్తోంది. అలాగే సుకుమార్ - అల్లు అర్జున్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు సైతం చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

     బాలీవుడ్‌లోనూ అడుగు

    బాలీవుడ్‌లోనూ అడుగు

    నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ' సినిమా గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడా సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్‌లో హీరోయిన్‌గా రష్మికను తీసుకుంటున్నారని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో షాహీద్ కపూర్ నటిస్తున్నాడు.

    బూతు మాటలతో పోస్ట్

    బూతు మాటలతో పోస్ట్

    ఇక, ఇటీవల రష్మికపై కొందరు నెటిజన్లు రాయడానికి వీలు లేని భాషలో పోస్టులు పెట్టారు. తాజాగా ఓ నెటిజన్ రష్మిక చిన్నప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు, ‘ఈ చిన్న పిల్ల పెద్దయ్యాక అంతర్జాతీయ **** అవుతుందని ఎవరైనా ఊహించారా' అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలోనే కాకుండా బయట కూడా చర్చనీయాంశం అయింది.

    రష్మిక ఇలా స్పందించింది

    రష్మిక ఇలా స్పందించింది

    తనపై ట్రోలింగ్ చేసిన విషయం రష్మికకు తెలియడంతో ఆమె స్పందించింది. ఆ పోస్టును తన స్టోరీగా పెట్టి మరీ రిప్లై ఇచ్చింది. ‘‘మీ దృష్టిలో సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్స్. అందుకే ట్రోలింగ్ చేస్తున్నారు. పబ్లిక్ ఫిగర్స్ అంటే మీరు ఇష్టం వచ్చినట్లు టార్గెట్ చేయడానికి ఉన్నవారు కాదు. మా పని గురించి మాట్లాడే హక్కు మీకుంది కానీ మా వ్యక్తిగత జీవితాల గురించి, కుటుంబాల గురించి మట్లాడే హక్కు మీకు లేదు. ప్రతి పనికి గౌరవం అవసరం. మొదట అవతలివారిని గౌరవించటం నేర్చుకోండి'' అంటూ చెప్పుకొచ్చింది.

    English summary
    Tollywood Actor Rashmika Mandanna had a similar experience recently, and she took to Instagram to respond to a particularly distasteful and misogynistic post. Sharing the abusive post on her Instagram story, Rashmika asked why trolls targeted public figures...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X