రష్మిక మందన్నా దమ్ము వీడియో వైరల్: ఒకేసారి అలా కనిపించడంతో వాళ్లంతా షాక్.. దేశ వ్యాప్తంగా హైలైట్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. టాలీవుడ్‌లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. అద్భుతమైన నటన, ఆకట్టుకునే అందంతో ఎనలేని గుర్తింపును సంపాదించుకుందీ భామ. అందుకే వరుసగా ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టేసింది. ఇలా కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈ బ్యూటీ.. తీరిక లేకుండా షూటింగ్‌లలో పాల్గొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక దమ్ము వీడియో కారణంగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

కన్నడం టు తెలుగు.. ఇలా పరిచయం
కన్నడంలో వచ్చిన 'కిర్రాక్ పార్టీ' అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది రష్మిక మందన్నా. ఆ వెంటనే 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి చిత్రాలు చేసింది. ఈ క్రమంలోనే 'ఛలో' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకీ ప్రవేశించింది. మొదటి సినిమాతోనే ఆకట్టుకోవడంతో ఇక్కడ ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో అమ్మడు ఫుల్ బిజీ అయిపోయింది.

వరుస విజయాలతో లక్కీ హీరోయిన్‌గా
తెలుగులో రష్మిక మందన్నా చేసిన చిత్రాల్లో ఎక్కువ శాతం విజయాలే ఉన్నాయి. మొదటి సినిమా నుంచి 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' వంటి భారీ హిట్లు ఆమె సొంతం అయ్యాయి. అయితే, ఎన్నో అంచనాలతో విడుదలైన 'దేవదాస్', 'డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను నిరాశ పరిచాయి. అయినప్పటికీ ఆమె తెలుగులో లక్కీ హీరోయిన్ అనే పేరుతో దూసుకెళ్లిపోతోంది.

నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపికైంది
2020 సంవత్సరానికి గాను 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా రష్మిక ఎన్నికైంది రష్మిక మందన్నా. గూగుల్‌లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే ఈ కన్నడ భామ పేరుతో పాటు ఆమెకు సంబంధించిన సమాచారం కనిపిస్తోంది. తక్కువ సినిమాలే చేసినా 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020' గా రష్మిక ఎంపిక కావడంతో ఆమె దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నట్లైంది.

టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ చిత్రాలు
ప్రస్తుతం రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప'లో హీరోయిన్‌గా చేస్తోన్న ఆమె.. శర్వానంద్ హీరోగా రాబోతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్నీ చేస్తోంది. వీటితో పాటు 'మిషన్ మజ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగు పెడుతోంది. అలాగే, తమిళంలో 'సుల్తాన్' అనే మూవీ చేస్తోంది.

ఈ సినిమా ఆమెకు చాలా ప్రత్యేకం అని
ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది రష్మిక మందన్నా. ఈ నేపథ్యంలో కార్తీ హీరోగా నటిస్తోన్న 'సుల్తాన్'తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్‌ఆర్ ప్రకాష్ బాబు, యస్‌ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ పూర్తైంది.
Recommended Video

రష్మిక మందన్నా దమ్ము వీడియో వైరల్
తాజాగా రష్మిక 'సుల్తాన్' మూవీ షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. ఈ మూవీలో పల్లెటూరి యువతిగా నటిస్తోన్న ఆమె.. వరి పొలంలోకి దిగి యంత్రంతో నేలను దమ్ము చేస్తోంది. ఇందులో ఆమె డీ గ్లామర్ లుక్‌తో కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. అదే సమయంలో ఈ వీడియో కారణంగా ఆమె దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతోంది.


Click it and Unblock the Notifications











