Rashmika: నాకు కాబోయే వాడు అందరికీ తెలుసు..అసలు విషయం చెప్పకనే చెప్పేసిన రష్మిక!
Rashmika Mandanna: ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత క్రేజ్ ఉన్న టాప్ హీరోయిన్ ఎవరంటే? ముందుగా గుర్తుకు వచ్చేంది రష్మిక మందన్న నే. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఈ అమ్మడు ఇమేజ్ ఇక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమాలో 'శ్రీవల్లి' పాత్ర రహ్మికకు ఎక్కడలేని పాపులారిటీని తెచ్చిపెట్టింది. దీంతో రష్మిక నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే గత కొంతకాలంగా ఓ స్టార్ హీరోతో రష్మిక మందన్న సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలన్నీటికి చెక్ పెడుతూ రష్మిక మందాన అసలు విషయం బయట పెట్టేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పిందంటే?
తమిళనాడులోని చెన్నైలో ఆదివారం 'పుష్ప వైల్డ్‌ఫైర్'వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ లో శ్రీలీలకు సంబంధించిన ఐటమ్ సాంగ్ 'కిస్సిక్' లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, శ్రీలీలతోపాటు రష్మిక మందన్నా హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. పుష్ప 2 షూటింగ్ అయిపోయాక, తనలో ఏదో మిస్సయిన ఫీలింగ్ వచ్చిందని అన్నారు. ప్రస్తుతం తన కెరీర్ పుష్ప ముందు పుష్పాకి తర్వాత అన్నట్లుగా మారిపోయిందని, ఈ మూవీ తనకు ఎనలేని పాపులార్టీ తీసుకొచ్చిందంటూ సంతోషపడింది నేషనల్ క్రష్.

ఆ తర్వాత స్టేజ్ పై ఉన్న తమిళ యాంకర్స్ రష్మిక మందాన తో చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్ లో భాగంగా వారు రష్మిక పెళ్లి గురించి ప్రస్తావించారు. దీంతో రష్మిక మందాన సిగ్గుపడుతూ.. చెప్పడానికి కొంత సంశయించింది. ఆ తర్వాత నవ్వుతూనే మీ అందరికీ తెలిసిందే కదా అంటూ ఓ చిన్న లీక్ ఇచ్చింది.
అంతటితో ఆగని ఆ యాంకర్స్..'మీరు సినీ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? లేదా వేరే పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. 'అది అందరికీ తెలిసిన విషయమే' అంటూ చెప్పేసింది. దీంతో ఆడిటోరియంలో పెద్ద ఎత్తున కేకలు వినిపించాయి. రష్మిక నవ్వుతూ సిగ్గుపడుతూ ఉండగా.. 'ఏంటి నిజమా.. మాకు తెలియదు. ఒక చిన్న హింట్ ఇవ్వండి' అంటూ హోస్ట్ రిక్వెస్ట్ చేస్తాడు. 'అలా చెప్పడం సరికాదు.. పర్సనల్గా చెప్తా 'అంటూ నవ్వుతూ సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది నేషనల్ క్రష్.
ప్రస్తుతం రష్మిక మందన్నా మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇన్ డైరెక్ట్ గా తన రిలేషన్ బయటపెట్టడంతో విజయ్ దేవరకొండ పేరు ట్రెండింగ్ అవుతోంది. అంతకు ముందు రోజు.. రష్మిక మందాన- విజయ్ దేవరకొండ కలిసి ఓ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ కెమెరాకు చిక్కిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంత ముందుకు కూడా ఓ సినిమా ఈవెంట్లో రష్మిక పెళ్లి గురించి విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ప్రశ్నించగా.. ఇలాంటి వ్యాఖ్యల్ని చేసింది రష్మిక. దీంతో రష్మిక మందాన-విజయ్ దేవరకొండలో డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











