మరో క్రేజీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక!
యంగ్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం సౌత్‌లో ఓ సెన్సేషన్. ఈ కుర్ర భామ అందాలకు యువత ఫిదా అవుతున్నారు. తెలుగులో ఛలో, గీత గోవిందం లాంటి సూపర్ హిట్ చిత్రాలతో రష్మికకు యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కొన్ని స్టార్ హీరోల చిత్రాల్లో రష్మిక ప్రస్తుతం అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల రష్మిక తమిళ ఇండస్ట్రీలోకి కుడా అడుగుపెట్టింది. హీరో కార్తీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రష్మికకు అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ స్టార్ హీరో శివకార్తికేయన్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏ చిత్రం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించనున్నాడు.

ఛలో చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక గీత గోవిందం చిత్రంలో నటనతో ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది. డియర్ కామ్రేడ్ చిత్రంలో మరోసారి విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేస్తోంది. ఇటీవల విడుదలైన డియర్ కామ్రేడ్ టీజర్ లో రష్మిక, విజయ్ దేవరకొండ లిప్ లాక్ సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











