వీడియో చూసి ఏడ్చేశా.. నేనేం చేశానని ఇంతలా.. భావోద్వేగానికి గురవుతూ రష్మిక!

Recommended Video

Rashmika Mandanna Gets Emotional Over Fans Response | Filmibeat Telugu

ఎంత అద్భుతమైన నటి అయినా, అందంగా ఉన్నా స్టార్ గా మారాలంటే కొంత అదృష్టం కూడా ఉండాలి. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మికకు ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. ఛలో లాంటి చిన్న చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయిన రష్మిక తక్కువ సమయంలోనే యువతలో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక మందన పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్. తాజాగా రష్మిక ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి గురైంది. ఆ వివరాలు చూద్దాం!

 ఉత్తమ నటిగా

ఉత్తమ నటిగా

ఛలో చిత్రంతో చలాకి నటిగా గుర్తింపు సొంతం చేసుకున్న రష్మిక ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. వీరిద్దరూ జంటగా నటించిన గీత గోవిందం చిత్రం ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళని రాబట్టింది. ఈ చిత్రంతో రష్మిక స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిత్రానికి గాను రష్మిక ఇటీవల ఉత్తమ నటిగా జీ సినిమా అవార్డు దక్కించుకుంది. రష్మిక అభిమానులు ఆమె కోసం ఓ వీడియోని రూపొందించారు.

ప్రశంసలతో

ప్రశంసలతో

రష్మిక క్రేజీ హీరోయిన్ గా రోజు రోజుకు ఎదుగుతున్న విధానాన్ని, ఆమెకు ప్రముఖుల నుంచి దక్కిన ప్రశంసల్ని అభిమానులు ఓ వీడియోలో రూపంలో అందించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ఎంత బాగా హావ భావాలు పలికిస్తుందో తెలియజేస్తూ విజయ్ దేవరకొండ గీత గోవిందం ప్రచార కార్యక్రమాల్లో పేర్కొన్న విషయాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.

వీడియో చూసి ఏడ్చేశా

ఈ వీడియో చూసి రష్మిక బాగా ఎమోషనల్ అయింది. ఇది నేను ఊహించలేదు. ఈ వీడియో చూసి నేను ఏడ్చేశా. నేను ఎం చేశానని నాపై ఇంత ప్రేమని చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఇలాంటి అభిమానులను పొందినందుకు గర్వాపడుతున్నా అని రష్మిక తెలిపింది. ఐ లవ్ యూ సో మచ్ గయ్స్ అంటూ రష్మిక ట్విట్టర్ లో స్పందించింది. కన్నడలో కిర్రాక్ పార్టీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

విజయ్ దేవరకొండ సరసన మరో చిత్రం

విజయ్ దేవరకొండ సరసన మరో చిత్రం

ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ మరోమారు డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక మహిళా క్రికెటర్ గా కనిపిస్తుందట. స్టూడెంట్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. నితిన్ నటించబోతున్న భీష్మ చిత్రంలో కూడా రశ్మికనే హీరోయిన్. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఛలో చిత్రం తర్వాత వెంకీ కుడుములు రెండవసారి రష్మికని భీష్మలో డైరెక్ట్ చేసాయబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X