Rashmika Mandanna జోరుకు బ్రేకులు.. తీవ్రంగా నిరాశలో..
కన్నడలో కిరిక్ పార్టీతో సంచలన విజయం సాధించిన తర్వాత.. యువ హీరో నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ ముద్దుగుమ్మ రష్మికా మందన్న. ఆ తర్వాత వరుసగా గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి వరుస విజయాలతో టాలీవుడ్ టాప్ ప్లేస్‌లోకి దూసుకుపోయింది. ఈమె కెరీర్‌లో ఇప్పటివరకు విజయాల శాతమే ఎక్కువ. ఇక, ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో ఆమె ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలో ఆమె క్రేజ్ తారస్థాయికి చేరింది.

పాన్‌ఇండియా స్థాయిలో క్రేజ్
తెలుగులో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న రష్మిక నేషనల్ క్రష్ అయిపోయింది. ఒకవైపు సినిమాలు.. మరోవైపు ప్రకటనలు. ఇలా ఈ భామ రెండు చేతులతోనూ సంపాదిస్తోంది. పైగా ఈ కన్నడ కస్తూరి కెరీర్‌లో ఇప్పటివరకు 80 శాతం విజయాలే ఉండడంతో ఈమెకు గోల్డెన్ లెగ్ ట్యాగ్ కూడా ఉంది. దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ రష్మిక ఇప్పుడు అవకాశాలు అందుకుంటూ బిజీ అవుతోంది. ఇటీవలె ముంబైలో ఓ ఫ్లాట్ తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కలిసి వచ్చిన `పుష్ప`
సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `పుష్ప` సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఆ సినిమా రష్మిక కెరీర్‌కు భారీ బూస్టింగ్ ఇచ్చింది. ఆ సినిమాలో రష్మిక నటన, డ్యాన్స్ ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్లామర్ పరంగా హద్దులు లేకపోవడం, ఎలాంటి సీన్లలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉండడం రష్మికకు ప్లస్ పాయింట్స్. `పుష్ప` సినిమాలోని వ్యాన్ సీన్‌తో రష్మిక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే బాలీవుడ్‌లో ఈమె రేంజ్ పెరిగిపోయింది.

గ్లామరస్ బ్యూటీ
చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన
వ్యక్తిగత, వృత్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటోంది. వీలైనప్పుడల్లా తన
హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు అందాల విందు అందిస్తోంది. సినిమాల్లో కూడా గ్లామరస్ రోల్స్‌తో అదరగొట్టేస్తోంది. ఒకవైపు నటనతో పాటు మరొక వైపు గ్లామరస్ బ్యూటీగా అభిమానులను అలరిస్తోంది.

సంపాదనతో బిజీబిజీ
తెలుగు, హిందీ, తమిళంలో రష్మిక వరుసగా సినిమాలు చేస్తోంది. హిందీలో ఈమె చేతిలో 2 సినిమాలు ఉన్నాయి. ఒక్కో సినిమాకు రష్మిక 4 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటోందని టాక్. ఇక తెలుగులో కూడా ఒక్కో సినిమా కోసం రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. ఇక బ్రాండ్ అంబాసిడర్‌గా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న రష్మిక ఒక్కో యాడ్‌కు రూ కోటి వరకు అందుకుంటోందట.
Recommended Video

బ్రేక్ వేసిన శర్వా సినిమా
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా రష్మికకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాదిని ఫ్లాప్‌తో ప్రారంభించాల్సి వచ్చింది. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని, కేవలం రెమ్యునరేషన్ కోసమే రష్మిక ఈ సినిమా ఒప్పుకుందని విమర్శలు వినిపించాయి. రష్మికకు గతంలోనూ `డియర్ కామ్రేడ్` రూపంలో ఓ ఫ్లాప్ ఎదురైంది. అయితే అది ఆమె కెరీర్‌పై పెద్దగా ప్రభావం చూపించలేదు. మరి, ఈ సినిమా పరాజయం రష్మిక కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపెడుతుందో చూడలి.


Click it and Unblock the Notifications











