రష్మిక మందన్నకు అరుదైన బహుమతి.. పెళ్లికి ముందు విజయ్ తల్లి ఇచ్చిన గిఫ్టు ఏమిటో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజస్థాన్ రాచరిక సంప్రదాయాల మధ్య హిందూ, కన్నడ ప్రాంతాల మతాచారాల ప్రకారం ఈ స్టార్ జంట దంపతులుగా మారబోతున్నారు. అయితే పెళ్లికి ముందు జరుగాల్సిన కార్యక్రమాలను పూర్తి చేసుకొని కల్యాణ గడియల కోసం వేచి చూస్తున్నారు. అయితే వివాహ కార్యక్రమాల సందర్భంగా పెళ్లి కొడుకు వారి ఆచారాల ప్రకారం రష్మిక మందన్నకు విజయ్ తల్లి అరుదైన బహుమతిని ఇవ్వడం ఇరు కుటుంబాలను భావోద్వేగానికి గురి చేసిందని తెలిసింది. కాబోయే కోడలికి విజయ్ తల్లి మాధవి ఇచ్చిన బహుమతి ఏమిటనే వివరాల్లోకి వెళితే..

ఫిబ్రవరి 26వ తేదీన జరిగే పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలను ఇరు కుటుంబాలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. హల్దీ, మెహందీ, సంగీత కార్యక్రమాలను జోష్‌తో ముగించారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల మధ్య పరస్పర స్నేహపూరిత వాతావరణం కనిపించిందని అతిథులు తెలిపారు. ఈ వివాహానికి రెండు కుటుంబాల నుంచి సుమారుగా 200 మంది హాజరు అవుతున్నారని తెలిసింది.

Rashmika Mandanna gets Rare Gift from Vijay Deverakonda s Mother

సంగీత్ కార్యక్రమాన్ని విజయ్, రష్మిక లవ్ థీమ్‌తో కొనసాగించారు. వారిద్దరి మధ్య అన్యోన్యతను తెలిపే ఫోటోలను ఫ్లెక్సీలుగా చేసి వేదికను అందంగా అలకరించారు. విజయ్, రష్మిక కుటుంబ సభ్యులు జోష్‌తో స్టెప్పులు వేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా తదితరులు పాల్గొన్నారు. పెళ్లి కోసం సందీప్ రెడ్డి వంగా, శివ నిర్వాణ తదితరులు ఇండస్ట్రీ నుంచి హాజరయ్యారని తెలిసింది.

సంగీత్ కార్యక్రమం సందర్భంగా విజయ్ తల్లి తమ వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించారు. తనకు వారసత్వంగా వచ్చిన బంగారు గాజులను రష్మికకు మాధవి బహుకరించారు. ఈ సందర్భంగా రష్మిక చాలా ఎమోషనల్ అయ్యారు అని తెలిసింది. గతంలో విజయ్ తల్లి గురించి మాట్లాడుతూ.. తనకు రెండో తల్లి లాంటిది చెప్పడం తెలిసిందే. వారిద్దరి మధ్య మంచి బాండింగ్, అవగాహన ఉందనే విషయం ఆ మాటలతో స్పష్టమైంది.

ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న విజయ్, రష్మిక వివాహానికి ప్రముఖులు కొద్ది మంది హాజరవుతున్నారని తెలిసింది. ఈ పెళ్లికి దేశంలోనే సంపన్నులైన అంబానీ సోదరులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇషా అంబానీ తదితరులు హాజరవుతున్నట్టు సమాచారం. ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో కనిపించడంతో ఈ పెళ్లికి వారు వచ్చారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వివాహానికి సంబంధించిన రిసెప్షన్ మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని ప్రైవేట్ హోటల్‌లో జరుగనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X