For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రష్మికకు మాజీ ప్రియుడి రేర్ బర్త్ డే గిఫ్ట్.. మాజీ ప్రియురాలికి చేరువయ్యేలా ఎమోషనల్ మెసేజ్

  |

  కన్నడ భామ రష్మిక మందన్న కెరీర్ గ్రాఫ్ యమ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. దక్షిణాది చిత్రాలతోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా అడుగపెట్టి ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. వరుస విజయాలతో ముందుకెళ్తున్న రష్మిక తన బర్త్ డేను ఏప్రిల్ 4వ తేదీన ఘనంగా జరుపుకొన్నది. తన జన్మదినం రోజున ఎంతో మంది నుంచి విషెస్ అందుకొన్న ఈ బ్యూటీకి ఓ ప్రత్యేకమైన సందేశాన్ని తన మాజీ ప్రియుడు పంపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పంపిన రేర్ గిఫ్ట్ ఏమిటంటే...

  వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్: పవన్ కళ్యాణ్ నా దేవుడంటూ బండ్ల గణేష్ రచ్చ (ఫొటోలు)

  కిరిక్ పార్టీతో సినీ రంగంలోకి

  కిరిక్ పార్టీతో సినీ రంగంలోకి

  కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ పరిశ్రమలోకి ప్రవేశించిన రష్మిక మందన్న అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్నారు. మాతృభాష కన్నడలో కంటే తెలుగులో వరుస విజయాలను దక్కించుకొన్నారు. ఛలో, గీతా గోవిందం లాంటి సినిమాలు ఆమెను స్టార్ హీరోయిన్‌గా మార్చాయి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో గ్లామర్ హీరోయిన్‌గా కూడా సెటిల్ అయ్యారు.

  రక్షిత్ శెట్టితో ప్రేమలో రష్మిక

  రక్షిత్ శెట్టితో ప్రేమలో రష్మిక

  అయితే కిరిక్ పార్టీ షూటింగు సమయంలో దర్శక, నిర్మాత, నటుడు రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడింది. ఆ తర్వాత వెంటనే ఇరు కుటుంబాలను ఒప్పించి నిశ్చితార్థం కూడా జరిపించేశారు. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు అనూహ్యంగా వారి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ అయింది. దాంతో రక్షిత్ శెట్టితో బంధానికి ముగింపు పలికింది.

  రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్

  రష్మిక ఎంగేజ్‌మెంట్ బ్రేకప్

  ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ తర్వాత రష్మిక మందన్న కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోనే అవకాశమే రాలేదు. తెలుగుతోపాటు హిందీ, తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఇటీవల రిలీజైన కార్తీ సుల్తాన్ మూవీతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇలా అద్భుతమైన కెరీర్‌ను కొనసాగిస్తున్న రష్మిక మందన్న ఏప్రిల్ 5వ తేదీన పుట్టిన రోజును జరుపుకొన్నది.

  రష్మిక సంబంధించిన కిరిక్ పార్టీ ఆడిషన్ వీడియో

  రష్మిక సంబంధించిన కిరిక్ పార్టీ ఆడిషన్ వీడియో

  రష్మిక పుట్టిన రోజున ఆమెకు మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి అరుదైన గిఫ్టును సోషల్ మీడియాలో అందజేశారు. కిరిక్ పార్టీ సమయంలో ఆడిషన్‌కు హాజరైన సమయంలో ఆమె చెప్పిన సమాధానాలను వీడియో రూపంలో షూట్ చేశారు. ఆ వీడియోను ప్రస్తుతం ట్విట్టర్‌లో షేర్ చేసి ఆమెకు శుభాకాంక్షలు అందించారు.

  ట్విట్టర్‌లో రక్షిత్ శెట్టి విషెస్

  కిరిక్ పార్టీ ఆడిషన్స్ రోజున నీ బ్యూటీఫుల్ మెమొరీని షేర్ చేస్తున్నాను. అప్పటి నుంచి నీ కలలను ఓ సైనికురాలిగా చేధిస్తూ నువ్వు కెరీర్ పరంగా చాలా దూరం ప్రయాణించావు. నువ్వు సాధించిన విజయాలను చూసి గర్వపడుతాను. హ్యాపీ బర్త్ డే టూ యూ. నీవు ఇంకా ఎంతో సక్సెస్ చూస్తావని ఆశిస్తున్నాను అని రక్షిత్ శెట్టి ట్వీట్ చేశారు.

  రష్మిక మందన్న కెరీర్

  రష్మిక మందన్న కెరీర్

  రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ఆమె నటించిన పొగరు చిత్రం కన్నడ, తమిళ భాషల్లో రిలీజైంది. ఆడాళ్లు మీకు జోహార్లు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రంలో, అలాగే హిందీలో మిషన్ మజ్ను, చిత్రంలో నటిస్తున్నారు. సుల్తాన్ సినిమా తర్వాత తమిళంలో మరికొన్ని ప్రాజెక్టులకు ఒకే చెప్పేందుకు సిద్దమవుతున్నారు.

  English summary
  Actress Rashmika Mandanna gets rare wishes from ex fiance Rakshit Shetty. Rakshit Shetty shares Sharing this beautiful memory of yours from the KirikParty audition. You have travelled so far since then, chasing you'r dreams like a real worrier. Proud of you girl and Happy Birthday to you. May you see more success Grinning faceHugging face iamRashmika
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X