Rashmika Mandanna: అడ్డంగా బుక్కైన రష్మిక.. చికెన్ తినడంపై ట్రోలింగ్.. అసలు ఏమైందంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 'కిరిక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయిన రష్మిక మందన్నా ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ సూపర్ పాపులర్ అవుతోంది. అయితే సినీ హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు, చేసే వ్యాఖ్యలపై ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలో వారు ఏదైనా తప్పు చేస్తే చేసే ట్రోలింగ్ మాములుగా ఉండదు. అలా తాజాగా రష్మిక చేసిన మిస్టేక్ కారణంగా ట్రోలింగ్ ఎదుర్కుంటోంది.

హిట్ తర్వాత: కన్నడ బ్యూటి రష్మిక మందన్నా నేషనల్ క్రష్ గా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. నాగ శౌర్య నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక. ఆమె చేసిన తొలి చిత్రానికి మంచి విజయం దక్కింది. ఈ సినిమా హిట్ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుని సత్తా చాటింది ఈ గ్లామరస్ బ్యూటి.

Rashmika Mandanna

విపరీతమైన క్రేజ్: ఛలో తర్వాత విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న యాక్ట్ చేసిన 'గీత గోవిందం' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అంతేకాకుండా ఈ సినిమాతో ఆమెకు యూత్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో రష్మిక స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప', 'సీతా రామం', 'వారసుడు' వంటి భారీ హిట్లను సొంతం చేసుకోవడంతో మరింత పాపులర్ అయింది.

సామీ సామీ అంటూ: ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మాత్రం దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది రష్మిక. ఇందులో శ్రీవల్లిగా యావత్ ప్రేక్షకులను తన నటనతో ఆకర్షించింది. ముఖ్యంగా సామీ సామీ అనే పాటకు రష్మిక వేసిన స్టెప్పు మరింతగా హైలెట్ అయింది. దీంతో ఆమెకు హిందీలోను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

Rashmika Mandanna

హిందీ చిత్రాల్లో: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి డీ గ్లామర్ రోల్ లో గుడ్ బై మూవీ చేసింది రష్మిక మందన్న. అనంతరం యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను సినిమాలో నటించింది. ఓటీటీలో విడుదలైన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. ఇలా తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీల్లో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది ఈ గ్లామర్ బ్యూటి.

Rashmika Mandanna

సమంత హీరోతో: ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్న చేతిలో వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో పుష్ప 2 మూవీతో పాటు రెయిన్ బో అనే సినిమా కూడా ఉంది. లేడీ ఒరియెంటెడ్ మూవీగా వస్తున్న రెయిన్ బో సినిమాలో శాకుంతలం హీరో దేవ్ మోహన్ యాక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక ట్రోలింగ్ బారిన పడింది. అందుకు కారణం నాన్ వెజ్ తినడమే.

Rashmika Mandanna

ఎలా ప్రమోట్ చేస్తుంది: రష్మిక మందన్న పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ చికెన్ బర్గర్ ప్రకటనలో యాక్ట్ చేసింది. ఇందులో తాను నాన్ వెజ్ తింటూ కనిపించింది. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను వెజిటేరియన్ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ రెండు వీడియోలను మిక్స్ చేసి నెటిజన్లు ట్రోలింగ్ కు దిగారు. తను టేస్ట్ చేయలేని ఫుడ్ ను ఎలా ప్రమోట్ చేస్తుందంటూ కోప్పడుతున్నారు.

నెటిజన్ల రియాక్షన్: రష్మిక రెండు రకాల ధోరణితో మేము అంత వెధవలా కనిపిస్తున్నామా అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా గరిమ కుమార్ అనే యూజర్ తన ఖాతాలో రష్మిక మందన్న వెజిటేరియన్ వెగన్ గా మారడం, ఆమె యాడ్ పై నెటిజన్ల రియాక్షన్స్ షేర్ చేస్తూ మరి ఓ వీడియో చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ కాగా, రష్మికపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X