For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందాలు ఆరబోసి షాకిచ్చిన రష్మిక మందన్నా: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  |

  చూపు తిప్పుకోకుండా చేసే అందం.. ప్రేక్షకులను ఫిదా చేయగల నటనతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది కన్నడ పిల్ల రష్మిక మందన్నా. పేరుకు శాండిల్‌వుడ్‌కు చెందిన అమ్మాయే అయినా.. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేస్తూ తెలుగు పిల్లలా మారిపోయిందీ బ్యూటీ. కెరీర్ ఆరంభంలోనే అదగొట్టేసి వరుస ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంది. ఇక, ఇప్పుడు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది. గత ఏడాది నేషనల్ క్రష్‌గా ఎంపికైన ఈ రష్మిక మందన్నా.. అప్పుడప్పుడూ అందాల విందు ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  ఆ మూవీతో మొదలు.. టాలీవుడ్‌లోకి

  ఆ మూవీతో మొదలు.. టాలీవుడ్‌లోకి

  ఇప్పుడు దేశ వ్యాప్తంగా హల్‌చల్ చేస్తోన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. శాండిల్‌వుడ్‌లో వచ్చిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ 'కిర్రాక్ పార్టీ'తో హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే అద్భుతమైన నటనతో పాటు గ్లామర్‌తో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించిందామె. దీంతో అదే భాషలో రష్మికకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే 'ఛలో' అనే సినిమాతో టాలీవుడ్‌లోకీ ప్రవేశించింది. మొదటి సినిమాతోనే హిట్‌ను అందుకుని టాలీవుడ్‌లోకి అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది.

  టాప్‌ను అమాంతం పైకి లేపిన విష్ణుప్రియ: అందాలు కనిపించేలా ఘాటు ఫోజులతో రచ్చ

  హిట్ హీరోయిన్.. స్టార్‌ స్టేటస్‌తో హవా

  హిట్ హీరోయిన్.. స్టార్‌ స్టేటస్‌తో హవా

  హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత మిగిలిన భాషలతో పోలిస్తే రష్మిక మందన్నా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయడంతో పాటు భారీ విజయాలను అందుకుంది. మొదటి చిత్రం 'ఛలో'తో సక్సెస్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. తర్వాత 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక, 'దేవదాస్', 'డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి. అయినప్పటికీ ఈ కన్నడ బ్యూటీ తెలుగులో లక్కీ హీరోయిన్ అని పేరు దక్కించుకుని దూసుకెళ్తోంది. తద్వారా మరిన్ని ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోందామె.

  తక్కువ సినిమాలతోనే నేషనల్ క్రష్‌గా

  తక్కువ సినిమాలతోనే నేషనల్ క్రష్‌గా


  తన కెరీర్‌లో రష్మిక మందన్నా చేసింది చాలా తక్కువ సినిమాలే. కానీ, ఆమె పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం 2020 సంవత్సరానికి గానూ 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎంపిక కావడమే. గూగుల్‌లో ఈ సెర్చ్ వర్డ్స్ టైప్ చేస్తే ఈ కన్నడ భామ పేరుతో పాటు ఆమెకు సంబంధించిన‌ సమాచారం కనిపించేది. అంతలా ఈ బ్యూటీ హవాను చూపిస్తోంది. గతంలో ఆమె రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇవన్నీ ఆమెను మరింత హైలైట్ చేశాయి.

  అభిమాని పెళ్లిలో పవన్ కల్యాణ్: ఇదేం క్రేజురా నాయనా.. తల్లిదండ్రులను కూడా కాదని పవర్‌స్టార్‌తో!

  ఇక్కడ అక్కడా రష్మిక ఫుల్ బిజీగానే

  ఇక్కడ అక్కడా రష్మిక ఫుల్ బిజీగానే

  రష్మిక మందన్నా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో అల్లు అర్జున్ 'పుష్ప'లో హీరోయిన్‌గా చేస్తోన్న ఆమె.. శర్వానంద్ హీరోగా రాబోతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్నీ చేస్తోంది. వీటితో పాటు 'మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి సైతం అడుగెడుతోంది. అలాగే, అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇవి మాత్రమే కాదు.. వరుసగా తమిళం, కన్నడ భాషల్లోనూ సినిమాలు ఒప్పుకుంటోంది. తద్వారా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ తన హవాను చూపిస్తూ దూసుకుపోతోంది.

  అందులో మాత్రం ఎప్పుడూ సందడిగా

  అందులో మాత్రం ఎప్పుడూ సందడిగా

  కొంత కాలంగా వరుస ఆఫర్లను అందుకుంటూ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రష్మిక మందన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటోంది. అదే సమయంలోనే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. తద్వారా తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోంది. ఇలా కూడా ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతోంది.

  టూపీస్ బికినీలో రామ్ చరణ్ భామ ఘాటు ఫోజులు: బట్టలు ఉన్నా లేనట్లే మరీ దారుణంగా!

  అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ

  అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ


  మిగిలిన హీరోయిన్లతో పోలీస్తే రష్మిక మందన్నా మరింత ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలను కూడా రష్మిక షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. ఆమె షేర్ చేసిన వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా దక్కుతూ ఉంటుంది. ఇది కూడా ఆమె నేషనల్ క్రష్‌గా ఎంపిక కావడానికి కారణం అని చెప్పొచ్చు.

  Recommended Video

  Pushpa రెండు భాగాలు గా వర్కౌట్ అవుతుందా.. బన్నీ, Sukumar తర్జన భర్జన || Filmibeat Telugu
  రష్మిక మందన్నా హాట్ ఫొటోలు వైరల్

  రష్మిక మందన్నా హాట్ ఫొటోలు వైరల్

  ప్రస్తుతం రష్మిక మందన్నా బిజీ షెడ్యూల్ కారణంగా ఇండియా మొత్తం చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఓ ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది. ఆ సమయంలో తీసిన ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ఇందులో ఈ కన్నడ పిల్ల అదిరిపోయే డ్రెస్‌లో ఊహించని విధంగా క్లీవేజ్ షో చేస్తూ కనిపించడమే. అదే సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్ ఉంది తొడలు కూడా కనిపించేలా ఉంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Now Doing Few Films At a Time. Now Her Hot Cleavage Show Photo Gone Viral In Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X