రష్మికకు జపాన్‌లో షాకింగ్ అనుభవం.. నేషనల్ క్రష్‌కు కన్నీళ్లు! ఫ్యాన్స్ ఎంత పని చేశారంటే?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఓ ఫ్రెష్‌నెస్ వస్తుంది. ఆమె క్యూట్ గ్లామర్ అండ్ యాక్టింగ్‌కు ఎంతో మంది ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమె ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ హీరోయిన్. కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌లో ఉంది. అయితే ఈమెకు ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ రేంజ్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా జపాన్ వెళ్లిన ఈ ముద్దుగుమ్మకు షాకింగ్ అనుభవం ఎదురైంది. అక్కడి అభిమానులు చేసిన పనికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. దాని గురించే ఈ కథనం..
వివరాల్లోకి వెళితే.. రష్మిక ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెండ్ అండ్ హాట్ టాపిక్ హీరోయిన్. ఆమె ఏం చేసినా ఇట్టే దాన్ని వైరల్ చేస్తుంటారు అభిమానులు. ఎందుకంటే ఈ భామ.. తన క్యూట్ అండ్ స్మైల్ యాక్టింగ్‌తో అందరి మదిని దోచేసింది. ఇక బోల్డ్ ఫొటోషూట్స్‌తో అయితే కుర్రాళ్లను నిద్రలేపేస్తుంది. ఈ మధ్య సినిమాల్లోనూ కాస్త గట్టిగానే బోల్డ్ ప్రదర్శన చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది.

తెలుగులో నాగశౌర్య ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ అందం.. ఆ తర్వాత గీతా గోవిందంతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరూ, భీష్మ వంటి చిత్రాలతో తెలుగులో మస్త్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ భామ పుష్పతో ఇండియా వైడ్‌గా ఫ్యాన్స్‌కు నేషనల్ క్రష్ అయిపోయింది. బాలీవుడ్‌లోనూ మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో పాటు రీసెంట్గా రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్ యానిమల్ చిత్రంతో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది.
అలా వరుస విజయాలను అందుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది. తెలుగులో కృతి శెట్టి, శ్రీలీల, సంయుక్త మేనన్ వంటి కొత్త హీరోయిన్లు వచ్చినా ఆమె క్రేజ్ అస్సలు తగ్గలేదు. అయితే రష్మిక సినిమాలతో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంటోంది. ఇంటర్నేషనల్ లెవెల్లోనూ జపాన్‌కు చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుకా టైగర్(Onitsuka Tiger)కు బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తోంది.
అలా ఆ దేశంలోనూ ఆమెకు అభిమానులు పుట్టుకొచ్చారు. అయితే తాజాగా ఈ బ్రాండ్‌కు సంబంధించిన పనుల్లో భాగంగా జపాన్‌కు వెళ్లిన రష్మికకు ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. ఆమె అక్కడి విమానాశ్రమంలో దిగగానే అభిమానులు ఘనస్వాగతం పలికారు. పుష్పలోని శ్రీవల్లి ఫొటోలను పట్టుకుని కేరింతలు కొడుతూ సందడి చేశారు.

దీంతో పరాయి దేశంలో తనకు దక్కిన ఊహించని ఘన స్వాగానికి రష్మిక సంతోషం వ్యక్తం చేసింది. అనందంతో ఆమెకు లైట్‌గా కన్నీళ్లు కూడా వచ్చాయట! దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. రష్మిక క్రేజ్ అంటే మాములుగా ఉండదు మరి, ఎల్లలు దాటింది అనడానికి ఇదే నిదర్శనం అంటూ సోషల్ మీడియా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే రష్మిక ప్రస్తుతం పుష్ప 2తో పాటు రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇంకా శేఖర్ కమ్ముల ధనుశ్ చిత్రంలోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











