సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు.. 'పుష్ప' కష్టాలపై రష్మిక మందన్న షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ బిగెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటైన పుష్ప సినిమా కోసం ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతున్న సమయంలో నటీనటులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందట. పుష్ప షూటింగ్ కోసం పడుతున్న కష్టం గురించి రష్మిక ఒక వివరణ కూడా ఇచ్చింది.

తక్కువ సమయం ఉండడంతో..
రీసెంట్ గా సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా తప్పకుండా ఈ ఎడాది ఆగస్టు 13న రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇంకా షూటింగ్ 70% పూర్తి చేయాల్సి ఉంది. ఇక తక్కువ సమయం ఉండడంతో దర్శకుడు సుకుమార్ అయితే స్పీడ్ పెంచినట్లు క్లారిటీగా అర్ధమయ్యింది. నవంబర్ నుంచి ఇప్పటివరకు రెండు కీలకమైన షెడ్యూల్స్ ను రంపచోడవరం, మారేడు మిల్లి ప్రాంతాల్లో ఫినిష్ చేశారు.

మరింత స్పీడ్ గా..
సాధారణంగా సుకుమార్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ సారి పుష్ప విషయంలో మాత్రం జెట్ స్పీడ్ లో ప్లాన్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతి ఒక్కరు తీరిక లేకుండా కష్టపడుతున్నట్లు సమాచారం. ఇక రానున్న రోజుల్లో స్పీడ్ డోస్ కూడా ఎక్కువ కానున్నట్లు తెలుస్తోంది.

నిద్ర..నాలుగు గంటలే..
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ రష్మిక మందన్న సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఆ సినిమా కోసం ప్రతి ఒక్కరు టైమ్ లిమిట్స్ లేకుండా కష్టపడుతున్నట్లు చెప్పారు. ఇక ఇటీవల జరిగిన షెడ్యూల్ లో అయితే పడుకోవడానికి కూడా సరిగ్గా టైమ్ దొరకలేదని ఒక్కరోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకునేదాన్ని అంటూ రష్మిక తెలిపింది.

ఆ కష్టం.. బిగ్ స్క్రీన్ పై కనిపిస్తుంది
అలాగే ప్రతి ఒక్కరి కష్టం సినిమా వెండితెరపై కనిపిస్తుందని షూటింగ్ లో మేకప్ వేసుకోవడానికి రెండు గంటల సమయం పట్టెదని తెలిపింది. అదే విధంగా ఫారెస్ట్ లొకేషన్స్ కు చేరుకోవడానికి కూడా చాలా సమయం పట్టెదని తెలిపిన రష్మిక అల్లు అర్జున్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా బావుందని.. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని వివరణ ఇచ్చింది.

బడ్జెట్ ఎంతంటే..
పుష్ప సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 200కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కొంత వరకు షూటింగ్ పూర్తి చేశారు. కరోనా కారణంగా కొంత గ్యాప్ రావడంతో మళ్ళీ షెడ్యూల్స్ లలో ప్లాన్ చేంజ్ చేశారు. ఇక సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ ని త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఇక వచ్చే నెల స్టార్టింగ్ లోనే ఒక కొత్త విలన్ పుష్ప టీమ్ ను కలవబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











