వన్ అండ్ ఓన్లీ రష్మిక .. ఒకే నెలలో రెండు 900 కోట్ల సినిమాలతో ఏ హీరోయిన్‌కి లేని రికార్డ్
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ మోస్ట్ హీరోస్ లిస్ట్ లో మన సౌత్ హీరోల పేర్లే ఎక్కువ కనిపిస్తాయి. వీరితో పాటుగా ఇండియన్ సినిమా టాప్ అండ్ బిజీ హీరోయిన్స్ లిస్ట్ తీసినా హిందీ హీరోయిన్స్ పేర్లు ఎక్కువ రావచ్చు కానీ ఒక్క హీరోయిన్ డామినేషన్ మాత్రం మామూలు లెవెల్లో లేదని చెప్పాలి. కాగా ఆ హీరోయిన్ నే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా..
రష్మిక పరిచయం అవ్వడానికి సౌత్ నుంచే అయ్యినప్పటికీ ఇపుడు పాన్ ఇండియా సినిమాని రూల్ చేస్తుంది. కాగా రష్మిక హీరోయిన్ గా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాలు చాలానే ఉన్నాయి కానీ తాను నటించిన లేటెస్ట్ భారీ చిత్రం ఒకటి మాత్రం ఇండియన్ సినిమాని షేక్ చేస్తుంది. ఆ సినిమానే పుష్ప 2 ది రూల్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలో రష్మిక తన పెర్ఫామెన్స్ తో పాటుగా బోల్డ్ హాట్ షోతో కూడా ఓ రేంజ్ లో అలరించింది. కాగా ఈ సినిమాతోనే రష్మికా తన కెరీర్‌లో మొట్టమొదటి 1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలో నటించిన హీరోయిన్‌గా నిలిచారు. అయితే ఆమె ఇపుడు టోటల్ ఇండియన్ సినిమా దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సేషనల్ రికార్డు తాను తన ఖాతాలో వేసుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.
ఒక్క ఏడాది వ్యవధిలో అది కూడా ఒకే నెలలో యాదృచ్చికంగా ఆమె నటించిన సెన్సేషనల్ పెర్ఫామెన్స్ చిత్రాలు 900 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని సంచలనం సెట్ చేసాయి. దీనితో ఇండియన్ సినిమా దగ్గర రష్మిక మందన్నాకి ఈ బోగ్ రికార్డు సొంతం అయ్యింది అని చెప్పాలి. మరి ఒక 900 కోట్ల సినిమా లేటెస్ట్ పుష్ప 2 అని అందరికీ తెలుసు. కానీ మరో సినిమా ఏదంటే .. సరిగ్గా ఇదే డిసెంబర్ 2023లో విడుదల అయ్యిన చిత్రం యానిమల్.

బాలీవుడ్ స్టారో హీరో రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఇలా ఒకే నెలలో రెండు సార్లు 900 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కొట్టిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర నేషనల్ క్రష్ నిలిచింది. అంతేకాదు.. ఈ రెండు సినిమాల్లో కూడా హీరోలు రష్మిక కాళ్ళ దగ్గరే వచ్చారు అని మరో క్రేజీ కో ఇన్సిడెంట్ కూడా కలిసిన సంగతి అందరికీ తెలిసిందే. దాని తర్వాత బాక్సాఫీస్ దగ్గర కూడా ఇలా కలవడం గమనార్హం.
ఇక రష్మిక నుంచి ఇది మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో పాన్ ఇండియా లెవెల్లో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. వీటిలో ధనుష్ తో కుబేర.. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సికందర్. అలాగే మరిన్ని ఇతర సినిమాలు చేస్తూ రష్మిక బాలీవుడ్ హీరోయిన్స్ కి సైతం గట్టి పోటీని ఇస్తూ టాప్ రేంజ్ లో దూసుకెళ్తుంది. ప్రస్తుతానికి పుష్ప 2 సక్సెస్‌ని రష్మిక ఎంజాయ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











