Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రేక్షకుల మన్ననలు అందుకుని స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఒకరు. అందానికి అందం.. అభినయానికి అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. కొన్ని బ్రాండ్లకు సైతం అంబాసీడర్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హలో ఇండియా అనే సంస్థ కవర్ ఫొటోలను ఫోజులిచ్చింది. వీటిలో ఈ రష్మిక అందాల విందు చేసింది. ఇకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

అలా మొదలైన రష్మిక ప్రయాణం
చిన్న వయసులోనే 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా రష్మిక మందన్నా హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన 'ఛలో' అనే మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో హిట్‌ను అందుకుని రష్మిక అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుంది.

టాలీవుడ్‌లో సక్సెస్‌కు చిరునామా
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత రష్మిక మందన్నా అన్ని భాషల్లో కంటే తెలుగులోనే ఎక్కువ సక్సెస్‌లను చూసింది. మొదటి చిత్రం 'ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుంది. ఇక, 'దేవదాస్', 'డియర్ కామ్రేడ్' వంటి పలు చిత్రాలు మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి.

జాతీయ స్థాయి గుర్తింపుతో హవా
తన కెరీర్ మొత్తంలో రష్మిక మందన్నా చేసిన సినిమాలు తక్కువే అయినా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. అందుకే 2020 సంవత్సరానికి గానూ ఆమె 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎంపికైంది. గతంలో ఆమె హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని బ్రేకప్ చేసుకోవడం.. టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరగడం వంటి వార్తల వల్లే ఈ పేరు దక్కింది.

అన్ని చోట్లా సందడి చేస్తోందిగా
రష్మిక మందన్నా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీతో వచ్చింది. ఇది ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీని మాత్రమే చేస్తోంది. అలాగే, 'మిషన్ మజ్ను' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. అలాగే, సౌత్‌లోనూ పలు చిత్రాలు ఒప్పుకుంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ
వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్‌డేట్లను కూడా ఇస్తోంది. దీంతో ఈ అమ్మడు తన ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోందిగా
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న రష్మిక మందన్నా.. ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగినవి కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలను కూడా రష్మిక మందన్నా వదలుతోంది. తద్వారా ఈ భామ తన అందచందాలతో ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తోంది.
Recommended Video

కవర్ ఫొటో కోసం కంచె తెంచేసి
ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల కోసం ముంబైలో ఉన్న రష్మిక మందన్నా.. హలో డిజిటల్ అనే సంస్థ కోసం కవర్ ఫొటోలు దిగింది. వీటిలో ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. ఈ పిక్‌లను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో వీటికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి ప్రస్తుతం వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











