రష్మీకను పెళ్లి చేసుకోవాలి అంటే, అతని దగ్గర అనుమతి తీసుకోవాలట.. మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ గర్ల్ రష్మీక మందన్న ఏం చేసినా డిఫెరెంట్ గానే ఉంటుంది. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ ఫొటోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక రష్మీక కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అభిమానులకు టచ్ లో ఉండటానికి ట్రై చేస్తుంటుంది.

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్..

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్..

ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి రష్మీక మందన్న అదృష్టం మామూలుగా లేదు. ఆమె ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అందరితో జత కడుతున్న రశ్మిక ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. మహేష్ బాబు సరిలేరు నికేవ్వరు, నితిన్ భీష్మ సినిమాలతో వరుస విజయాల్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఆమెకు పోటీగా..

ఆమెకు పోటీగా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఎక్కువగానే ఉంది. సీనియర్ హీరోయిన్స్ బోర్ కొట్టడంతో జనాలు కొత్తగా వచ్చిన బ్యూటీల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో రష్మీకకు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఇక పూజా హెగ్డేకి గట్టి పోటీని ఇస్తున్న ఏకైక బ్యూటీ రష్మీక. అమెతో సమానంగా ఇప్పుడిపుడే స్టార్ హీరోలతో నటిస్తోంది ఈ కన్నడ సుందరి.

రష్మీకను పెళ్లి చేసుకోవాలి అంటే..

రష్మీకను పెళ్లి చేసుకోవాలి అంటే..

ఇటీవల ఒక నెటీజన్ చేసి కామెంట్ కి రష్మీక ఎవరు ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చింది. దేవుడు కనిపిస్తే రష్మీకకు నన్ను భర్తగా అయ్యేలా చేయమని కోరుకుంటా అని ఒక నెటీజన్ చేసిన కామెంట్ కు.. రష్మీక తన పెంపుడు కుక్క ఫోటోని పోస్ట్ చేసి.. ముందు ఇతని అనుమతి తీసుకోండి అని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.

Recommended Video

Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
పుష్ప కోసం..

పుష్ప కోసం..

ఇకపోతే ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మీక కూడా బన్నీకి పోటీగా చిత్తూరు యాసలో మాట్లాడనుందట. భీష్మ సినిమాలో ఇప్పటికే సొంతంగా డబ్బింగ్ చెప్పి అదరగొట్టిన రశ్మక మరోసారి ప్రత్యేకంగా తెలుగు భాషపై పట్టు సాధిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయితే అమ్మడి రేంజ్ సౌత్ లో ల్మరో స్థాయికి పెరిగిపోతుంది. మరి ఈ భామ ఇంకా ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X