విజయ్‌తో నిశ్చితార్థంపై రష్మిక క్లారిటీ.. నా జీవితంలో చాలా జరిగాయంటూ..

Rashmika Mandanna - Vijay Deverakonda: టాలీవుడ్ హిట్ ఫెయిర్స్ లో రష్మిక మంధాన - విజయ్ దేవరకొండ ఒకటి. అయితే.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వీరిద్దరి పేర్లు తెగ వినిపిస్తున్నాయి. రష్మిక మంధాన, విజయ్ దేవరకొండ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారన్న పుకార్లు చర్చనీయాంశంగా మారాయి. గత వారం ఓ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ చేతికి ఓ రింగ్ కనిపించడంతో ఆ నిశ్చితార్థ వార్తలకు ఊతమిచ్చినట్టు అయింది. అయితే, ఈ జంట ఎక్కడా తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా హీరోయిన్ రష్మిక మంధాన ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?

తాజాగా రష్మిక మంధాన తన కొత్త చిత్రం 'థమ్మా' ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందర్భంలో పరోక్షంగా ఈ ఎంగేజ్‌మెంట్ వార్తలకు హింట్ ఇచ్చారు. జర్నలిస్ట్ రంగన్ బరద్వాజ్ ఇంటర్వ్యూలో రష్మికకు శుభాకాంక్షలు చెప్పగా, ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. సరదాగా ఇంకేమైనా శుభవార్త ఉందా? అని ప్రశ్నించారు. దానికి రష్మిక సిగ్గుపడుతూ, చిరునవ్వుతో లేదు లేదు అంటూనే బదులిచ్చింది. కొద్ది సేపటి తర్వాత చిరునవ్వుతో.. 'వాస్తవానికి నా జీవితంతో చాలా విషయాలు జరుగుతున్నాయి. కానీ, వాటన్నింటికీ మీ విషెస్ తీసుకుంటాం..'అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రష్మిక-విజయ్ నిశ్చితార్థ వార్తలకు మరింత బలం చేకూరినట్లుగా నెటిజన్లు భావిస్తున్నారు.

Rashmika Mandanna Hints at Secret Engagement with Vijay Deverakonda Amid Rumours

సోషల్ మీడియా వార్తల ప్రకారం.. రష్మిక మంధాన, విజయ్ దేవరకొండ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోవడం ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీరు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా కలిసి నటిస్తున్నారు. రష్మిక వరుసగా 'యానిమల్', 'పుష్ప 2', 'ఛావా' వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. బాక్సాఫీస్‌ స్టార్‌ హీరోయిన్ గా నిలిచారు.

తాజాగా 'థమ్మా'సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రష్మిక, అయ్యుష్మాన్ ఖురానా, నవాజుద్దిన్ సిద్దిఖీ జంటగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీను హారర్-రొమాంటిక్ కామెడీ హర్రర్ గా తెరకెక్కించారు. అయ్యుష్మాన్ సాధారణ వ్యక్తి నుంచి పిశాచుడిగా మారే పాత్రలో, రష్మిక అతని ప్రేయసిగా కనిపించనున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్‌గా, పాప్‌లర్ రామ్ బజాజ్ గోయల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 21, 2025న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు విజయ్ 'కింగ్డమ్'తర్వాత మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు.

రష్మిక-విజయ్ జంట తొలిసారి'గీత గోవిందం'లో నటించారు. ఆ తరువాత 'డియర్ కామ్రేడ్'సినిమాతో మరోసారి హిట్ అందుకున్నారు. ఈ సినిమా సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని అభిమానులు నమ్ముతున్నారు. ఈ రూమర్స్ మరింత బలం చేకూరేలా తరుచు మీడియా కంటపడ్డారు. ఈ నేపథ్యంలో విజయ్ - రష్మికలు సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగినట్టు వార్తలు రావడంతో వీరి టాపిక్ ఇండస్ట్రీలో చర్చనీయంగా మారింది.

రష్మిక మంధాన, విజయ్ దేవరకొండ జంట మొదటగా గీత గోవిందం లో కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాక, రొమాంటిక్ కెమిస్ట్రీ వల్ల అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' చిత్రంతో మరోసారి హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో నటించే సమయంలో ఇద్దరూ ప్రేమలో పడినట్లు అభిమానులు నమ్ముతున్నారు. మీడియా తరచుగా వీరి బంధంపై ప్రశ్నలు విసురుతూ, రూమర్స్ ను మరింత బలం చేకూరింది.

ఈ నేపథ్యంలో ఇటీవల ఈ జంట సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వీరి నిశ్చితార్థం చుట్టూ ఉన్న వాస్తవాలు ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా, సోషల్ మీడియాలో ఉంగరాలు, ప్రత్యేక శుభాకాంక్షల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్, టాలీవుడ్, బాలీవుడ్ అభిమానులు ఈ సీక్రెట్ నిశ్చితార్థ వార్తపై రియాక్ట్ అవుతున్నారు. ఇలా రష్మిక-విజయ్ ప్రేమకథ, నిశ్చితార్థ రూమర్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి, ఇద్దరి ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచిందని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X