For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తుంటారు.. వెళ్తుంటారు. కానీ, అందులో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్ స్టేటస్‌ను అందుకుంటారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు. నటనతోనే కాకుండా.. అందంతోనూ ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ భామ.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది.

  దీంతో టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. ఇతర భాషల్లోనూ అమ్మడు సందడి చేస్తోంది. ఇక, సోషల్ మీడియాలోనూ రష్మిక మందన్నా తెగ హల్‌చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ క్లీవేజ్ షో చేస్తూ దిగిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

  అలా పరిచయం.. తెలుగులోకి ఇలా

  అలా పరిచయం.. తెలుగులోకి ఇలా

  'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ సినిమాతో రష్మిక మందన్నా హీరోయిన్‌గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే ఆకట్టుకుని 'అంజనీ పుత్ర', 'చమ్మక్' వంటి చిత్రాల్లో చేసింది. ఈ క్రమంలోనే నాగశౌర్య 'ఛలో' అనే సినిమాతో తెలుగులోకి కూడా పరిచయం అయింది. ఫస్ట్ మూవీతో హిట్‌ను అందుకుని టాలీవుడ్‌లోకి అదిరిపోయే ఆరంభాన్ని సొంతం చేసుకుందామె.

  దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో

  సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఫుల్ ఫేమ్

  సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ఫుల్ ఫేమ్

  కన్నడం కంటే తెలుగులోనే రష్మిక మందన్నా ఎక్కువ హిట్లను ఖాతాలో వేసుకుంది. 'ఛలో'తో సక్సెస్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. తర్వాత 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక, 'దేవదాస్', 'డియర్ కామ్రేడ్' మాత్రం ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి. అయినా స్టార్ స్టేటస్‌ను అందుకుంది.

  దేశ వ్యాప్తంగా గుర్తింపు.. క్రష్‌గా మారి

  దేశ వ్యాప్తంగా గుర్తింపు.. క్రష్‌గా మారి

  తన కెరీర్‌లో రష్మిక మందన్నా తక్కువ సినిమాలే చేసినా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అంతేకాదు, 2020 సంవత్సరానికి గానూ 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎంపికైంది. గతంలో ఆమె రక్షిత్ శెట్టి అనే హీరోతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా పలు విషయాల వల్లే ఫేమస్ అయిపోయింది.

  టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా సందడి

  ఇక్కడే కాదు.. అక్కడ కూడా సందడి

  ఈ మధ్య కాలంలో రష్మిక చేతి నిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే 'పుష్ప'తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఆమె.. శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్ని చేస్తోంది. అలాగే, 'మిష‌న్ మ‌జ్ను' చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. వీటితో పాటు అమితాబ్‌తో కలిసి 'గుడ్‌బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. అంతేకాదు, దక్షిణాది చిత్రాల్లోనూ మెరుస్తోంది.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

  సినిమాల మీద సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. రష్మిక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక పోస్టు చేసి హైలైట్ అవుతోంది. ఎక్కువగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలోనే తన ఫొటోలు, వీడియోలను వదులుతోంది.

  Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ

  గ్లామర్ ట్రీట్‌లో డోసు పెంచిన శ్రీవల్లి

  గ్లామర్ ట్రీట్‌లో డోసు పెంచిన శ్రీవల్లి

  సోషల్ మీడియా ఖాతాల్లో రష్మిక మందన్నా ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ దిగిన పిక్స్ కూడా ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన ఫొటోలను కూడా రష్మిక మందన్నా షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా పాపులారిటీని పెంచుకోవడంతో పాటు ఇంటర్నెట్‌ను కూడా ఓ ఊపు ఊపి పడేస్తోంది.

  క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన హీరోయిన్

  క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన హీరోయిన్


  తాజాగా రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె లాంగ్ ఫ్రాక్ వేసుకుని ఉంది. ఈ డ్రెస్‌లో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. అంతేకాదు, కసిగా చూస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫోజులు పెట్టింది. దీంతో వీటికి నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఫలితంగా ఇవన్నీ వైరల్ అయిపోయాయి

  English summary
  Tollywood Heroine Rashmika Mandanna Very Active in Social Media. Now She Shared Hot Photos in Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X