రష్మిక మందన్నాపై కన్నడ వాసుల కన్నెర్ర.. కారణం ఏమిటి అంటే?
ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఓ రేంజ్ లో షేక్ చేస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఎలాంటి డౌట్ లేకుండా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అనే చెప్పవచ్చు. కాగా రష్మిక ఇపుడు చేస్తున్న ఒకో సినిమా ఒకదాన్ని మించి ఒకటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతూ వస్తున్నాయి. కాగా దీనికి ఫలితంగా పాన్ ఇండియా లెవెల్లో ఈమెకి భారీ డిమాండ్ నెలకొంది.
దీనితో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా రష్మిక మారిపోయి నిర్మాతలు సహా హీరోలకి కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఈమె మారిపోయింది. కాగా రష్మిక కెరీర్ స్టార్ట్ చేసి ఒక దశాబ్ద కాలం కూడా కాలేదు కానీ ఇపుడు ఏకంగా ఇండియన్ సినిమా దగ్గర టాప్ హీరోయిన్స్ లా ఒకామెగా మారిపోయింది. ఇక ఇదిలా ఉండగా రష్మిక హిట్స్ కొడుతూ దూసుకెళ్తుంది కానీ ఆమె విషయంలో ఎప్పటికప్పుడు పలు కొత్త కొత్త కాంట్రవర్సీలు కూడా ఊహించని విధంగా రేకెత్తుతూ వస్తుంటాయి.

కాగా రష్మిక మందన్నాపై ఆమె లుక్స్ పరంగా కొన్నిసార్లు నటన పరంగా కూడా పలు నెగిటివ్ ట్రోల్స్ పడ్డాయి కానీ వీటికంటే సీరియస్ ఇష్యూస్ కూడా ఆమె ఎదుర్కోక తప్పలేదు. మెయిన్ గా రష్మిక తన సొంత గడ్డ ప్రజల నుంచి గత కొన్నాళ్ల నుంచి గట్టి నెగిటివ్ ఎదుర్కొంటుంది. తన కెరీర్ అక్కడే స్టార్ట్ చేసినప్పటికీ తెలుగులో ఆమెకి పెద్ద బ్రేక్ వచ్చింది.
ఇక్కడ నుంచి తెలుగు సహా హిందీ సినిమాలు మాత్రమే ఈ కన్నడ బ్యూటీ చేస్తుండగా కన్నడ ఇండస్ట్రీని పూర్తిగా పక్కన పెట్టేసింది. కాగా రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టి లాంటి స్టార్స్ తో పలు విషయాల్లో తనకి కాంట్రవర్సీ ఉండడం ఇలా కర్ణాటక విషయంలో మాత్రం రష్మిక కొన్నాళ్ల నుంచి డిస్టెన్స్ మైంటైన్ చేస్తుంది.
ఇక మొన్ననే తన ఇల్లు హైదరాబాద్ అంటూ చేసిన కామెంట్స్ ఆమెని కన్నడ ఆడియెన్స్ లో మరింత నెగిటివ్ గా మార్చగా ఇపుడు మరిన్ని కొత్త చిక్కులు ఆమె తెచ్చుకుంటుంది. కాగా రీసెంట్ గానే కర్ణాటక బెంగళూరులో నిర్వహించిన ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి రష్మిక రాకపోవడమే ఇపుడు తనని కొత్త చిక్కుల్లో పడేసింది. కాగా అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే రష్మికపై విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్యే రవి గనిగ రష్మికకి ఒక గుణపాఠం చెప్పాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇక్కడ కిరిక్ పార్టీ సినిమాతో లైఫ్ స్టార్ట్ చేసింది కానీ ఇక్కడ ఫిలిం ఫెస్టివల్ ఉందని పది పన్నెండు సార్లు మనిషిని పంపి మరీ ఆహ్వానించినా కూడా రాను అని చెప్పింది అని షాకింగ్ కామెంట్స్ చేశారు. మొన్నామధ్య హైదరాబాద్ తన ఇల్లు అని కూడా చెప్పింది.
ఇలా ఎక్కడ నుంచి వచ్చారో మర్చిపోయినవారికి పాఠం చెప్పాలి కదా అంటూ తాను చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో కన్నడ ఆడియెన్స్ లో సంచలనంగా మారాయి. కాగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏమిటంటే ఇంత జరుగుతున్నా కూడా రష్మిక ఎందుకు ఇంత తెగే వరకు తెచ్చుకుంటుంది అనేది. తనపై ఎప్పుడు నుంచో కోపంగా ఉన్నారని తెలిసి కూడా ఇంకా ఇంకా దానిని తనకి నెగిటివ్ గానే మార్చుకుంటుంది కానీ సెటిల్ చేసుకునే యత్నం చేయకపోవడం గమనార్హం. మరి ఆమె అంత పర్శనల్ గా హర్ట్ అయ్యిందా అనేది మాత్రం తనకే తెలియాలి.


Click it and Unblock the Notifications











