Rashmika Mandanna: భలే ఆఫర్ పట్టేసిన రష్మిక మందన్న!

ప్రస్తుతం సౌత్ ఇండియా నుంచి భారీ ఫేమ్ ఉన్నటువంటి పాన్ ఇండియా హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. అయితే సౌత్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్లో పాగా వెయ్యాలని కూడా కొందరు హీరోయిన్స్ ఆల్రెడీ ప్లానింగ్ లు చేసుకుంటున్నారు కానీ వారి కంటే ముందే పాన్ ఇండియా సినిమా దగ్గర పాగా వేసిన హీరోయిన్ మాత్రా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా అనే చెప్పాలి.

కాగా రష్మిక హీరోయిన్ గా సౌత్ లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని సినిమాలతోనే భారీ స్టార్డం తెచ్చేసుకుంది. పైగా ఆమెపై కొన్ని ట్రోల్స్ కూడా ఉన్నప్పటికీ రష్మిక మందన్నా చేసిన సినిమాలు పక్కా హిట్స్ కావడంతో గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. కాగా ఇక్కడ నుంచి రష్మిక మందన్నాకి వరుస ఆఫర్స్ మొదలయ్యాయి. అలా ఆ సినిమాలు కూడా దాదాపు హిట్స్ గానే నిలిచాయి.

rashmika mandanna in this bollywood hit horror universe

ఇక నెక్స్ట్ రష్మిక హవా నార్త్ కి వెళ్ళింది. ఐకాన్ స్టార్ అల్లు అల్లు అర్జున్ తో చేసిన పుష్ప 1 తో హిందీ ఆడియెన్స్ ని పలకరించిన రష్మిక నార్త్ లో కూడా అది కాకుండా మరో సినిమాతో రష్మికా మందన్నాకి కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. ఇక మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అలాగే హీరో రణబీర్ కపూర్ తో చేసిన భారీ సినిమా ఆనిమల్ తో అయితే ఆమెకి బాలీవుడ్ లో బిగ్ బ్రేక్ కూడా వచ్చింది.

దీనితో సౌత్ లో ఎలా అయితే ఫామ్ ని కంటిన్యూ చేసింది. ఇలా హిందీలో వరుస సినిమాలు ఓకే చేసిన రష్మిక ఇపుడు బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ ని అయితే అందుకుంది. కాగా ఇదే బిగ్ ఆఫర్ అనుకుంటే మరో సెన్సేషనల్ ఆఫర్ ని హిందీ సినిమా దగ్గర నేషనల్ క్రష్ అందుకున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది.

rashmika mandanna in this bollywood hit horror universe

ఈ ఏడాదిలోనే హిందీ మార్కెట్ లో భారీ లాభాలు చూసిన నిర్మాణ సంస్థ మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ లో రష్మికా ఇపుడు కీలక పాత్ర చేస్తున్న సినిమా ఓకే చేసింది. వీరి బ్యానర్ లో వచ్చిన హారర్ సినిమాలు స్త్రీ 2, ముంజ్యా లు ఈ ఏడాది భారీ సక్సెస్ సాధించి దుమ్ము లేపాయి. కాగా ఈ సినిమాల హారర్ యూనివర్స్ లోకే ఇపుడు రష్మిక అడుగు పెట్టినట్టుగా ఖరారు అయ్యింది.

కాగా హిందీలో వీరి హారర్ యూనివర్స్ లోకి రష్మిక "థామా" అనే ఒక హారర్ అండ్ లవ్ డ్రామాలో కనిపించనుంది. కాగా ఈ చిత్రంలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా మాడాక్ సినిమాస్ నుంచి వచ్చిన హారర్ సినిమాలు భేడియా, ఈ ఏడాదిలో వచ్చిన స్త్రీ 2, ముంజ్యా లతో కలిపే ఉంటుంది అన్నట్టుగా టాక్. మరి మొత్తానికి అయితే రష్మిక మాత్రం ఒక క్రేజీ హై లో ఉందని చెప్పాలి.

More from Filmibeat

Read more about: rashmika mandanna stree 2 munjya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X