For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రష్మీక మందన్న దూకుడు మామూలుగా లేదు..డబ్బే డబ్బు.. నాలుగేళ్ళలోనే అన్ని కోట్లా..?

  |

  టాలీవుడ్ లో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మీక మందన్న. గత కొంతకాలంగా సీనియర్ నటీమణుల హవా తగ్గడంతో ఎక్కువగా స్టార్ హీరోలను ఆకర్షిస్తోంది ఈ ఛలో బ్యూటీ. ఒకవైపు నుంచి ఇతర హీరోయిన్స్ పోటీ ఇస్తున్నప్పటికి అమ్మడు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ఆదాయంలో ఈ నాలుగేళ్లలో రష్మీక ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒకసారి ఆమె రికార్డులపై ఒక లుక్కేస్తే..

  పట్టిందాల్లా బాక్సాఫీస్ హిట్

  పట్టిందాల్లా బాక్సాఫీస్ హిట్

  కన్నడ ఇండస్ట్రీలో ఒక హిట్టు అందుకుందో లేదో రష్మీక ఒక్కసారిగా టాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకర్షించింది. సింపుల్ గా ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటూ వచ్చింది. మధ్యమధ్యలో కొన్ని అపజయాలు ఎదురైనప్పటికి గీతగోవిందం మేడం కొన్నిసమయాల్లో పట్టిందాల్లా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

  పోటీగా బుట్టబొమ్మ

  పోటీగా బుట్టబొమ్మ

  ఒకవైపు నుంచి ఈ బ్యూటీకి బుట్టబొమ్మ పూజ హెగ్డే పోటీని ఇస్తోందనే చెప్పాలి. ఆమె ప్రస్తుతం అగ్ర హీరోలనే టార్గెట్ చేస్తోంది. కాజల్, తమన్నా వంటి స్టార్ హీరోయిన్స్ ను దాటేసి వారికంటే హై రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటోంది. ముఖ్యంగా అల.. వైకుంఠపురములో సినిమాతో ఒక్కసారిగా ఆమె యూ టర్న్ తీసుకుందనే చెప్పాలి.

  మాళవిక మోహనన్ బ్యూటిఫుల్ ఫోటో గ్యాలరీ.. క్లీవేజ్‌ షోతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

  Sukumar High Voltage Story For Vijay Devarakonda Project
  ఆ సినిమాలు హిట్టవ్వడంతో..

  ఆ సినిమాలు హిట్టవ్వడంతో..

  ఇక రష్మీక మందన్న ఆదాయం విషయానికి వస్తే ఈ బ్యూటీ ఒక సినిమాకు 2కోట్లకు తక్కువ తీసుకోవడం లేదని టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో కమర్షియల్ హిట్ దక్కడంతో సౌత్ లో అమ్మడి డిమాండ్ పెరిగింది. ఏ మాత్రం తగ్గించకుండా ఫామ్ లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తోంది.

  రూ.3 కోట్ల నుంచి..

  రూ.3 కోట్ల నుంచి..

  ఇక 2016లో రష్మీక సంపాదన రూ.3కోట్ల రూపాయలు మాత్రమే. ఆమె అంతకుముందు లక్షల్లోనే రెమ్యునరేషన్ అందుకునేది. ఇక వరుసగా బాక్సాఫీస్ హిట్స్ పడడంతో ఆమె ఆదాయం 2017లో 7కోట్లు, 2018లో రూ.9.50కోట్లకు చేరింది. అనంతరం 2019లో ఆమె రెమ్యునరేషన్ మరో స్థాయికి వెళ్లడంతో ఆదాయం 16కోట్లకు దగ్గరైంది.

  సినిమాల ద్వారానే కాకుండా..

  సినిమాల ద్వారానే కాకుండా..

  ఇక 2020 ఏండింగ్ కు వచ్చేసరికి రష్మీక ఆదాయం 25కోట్లకు చేరింది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా రష్మీక ఇతర యాడ్స్ లలో కూడా నటిస్తూ తన సంపాదనకు మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తో అమ్మడు పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ పాన్ ఇండియా ప్రాజెక్టు హిట్టయితే రష్మీక రెమ్యునరేషన్ మరింత పెరుగుతుంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేయడానికి అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  English summary
  Tollywood star heroes have been making movies with star directors lately. As the market grows, producers are also not adding new directors to star heroes. As far as possible, the directors who are blinding Labal with commercial films are selecting. Recently, Allu Arvind made a huge remuneration offer for his son, a star director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X