Rashmika Mandanna : గాయపడ్డ పుష్ప 2 బ్యూటీ.. ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ.. అసలేం జరిగిందంటే?

Rashmika Mandanna: నేషనల్ వైడ్ గా నంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తోన్న హీరోయిన్ రష్మిక మందన్న. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో రష్మిక మందాన నేషనల్ వైడ్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లలో రష్మిక కూడా చేరింది. అయితే తాజాగా రష్మిక గాయపడినట్లు తెలుస్తుంది ఇంతకీ ఏం జరిగిందంటే?

రష్మిక మందాన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కన్నడ భామ అయినా రష్మిక టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా సినిమాలలో నటించింది. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ 'గీతా గోవిందం' అనే సినిమాతో మంచి బ్రేక్ లభించింది. ఈ సినిమా హిట్ కావడంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

Rashmika Mandanna injury in the gym takes a small break from Salman Khan Sikandar shoot

అలా అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 1 సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో ఒదిగిపోయింది రష్మిక. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో రష్మిక మందాన. నేషనల్ క్రష్ గా మారింది. ఇలా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్లో అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఈ తరుణంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమాలో నటించి తన అందాల ఆరబోతతో నేషనల్ క్రష్ గా మారింది.

ఇటీవల పుష్ప 2 సినిమా లో కూడా నటించింది. ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఈ మూవీ. ఈ సినిమాలో రష్మిక మరోసారి తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఐదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయట. అందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించిన అవకాశాన్ని కొట్టేసింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'సికిందర్' అనే సినిమాలో రష్మిక ప్రధాన పాత్రలో పోషిస్తుందట. అలాగే ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలో కూడా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుందట. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

అయితే ఇటీవల రష్మిక మందాన తన జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడిందట. దీంతో డాక్టర్లు కొన్ని రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రష్మిక మందాన త్వరగా కోలుకోవాలని తన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ రష్మిక మందన నటించిన సికిందర్ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారట. ఈ సినిమా హిట్ అయితే రష్మిక మందాన బాలీవుడ్ కెరీర్ కు తిరుగు ఉండదంటూ ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X