రష్మిక మందన్నను కించపరిచిన బాలీవుడ్ హీరోయిన్.. ఆమె ఎవరు? ఎందుకు?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. బిగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ అంతకంతకు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వివిధ పాత్రలు పోషిస్తూ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వేసుకుంటుంది. కన్నడ చిత్రం నుంచి వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలన నటిగా మారిపోయింది. స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ దీటైన పర్ఫామెన్స్ ఇస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే నేషనల్ ఫ్రెష్ అనే బిరుదున్న ఆమె స్టార్ హీరోయిన్గా కూడా పలు రికార్డు ను సెట్ చేస్తూ వస్తుంది.

చివరిగా తన నటించిన చిత్రాలు పుష్ప 2, ఛావా ఎలాంటి విజయాన్ని అందించాయో తెలిసిందే. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 తో ఏకంగా నేషనల్ క్రష్ గా మారడమే కాకుండా ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ క్రాసింగ్ ఫిలింను తన ఖాతాలో వేసుకుంది. ఇక పుష్ప2 బాక్సాఫీస్ వద్ద 1870 కోట్లు సంపాదించిన విషయం తెలిసిందే. మన వైపు రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ చిత్రం ఛావా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Rashmika Mandanna Insulted by Bollywood Actress

అంతకుముందే బాలీవుడ్లో రష్మిక మందన్న బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా రష్మిక మందన నటించిన ఛావా కూడా బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు కూడా రష్మిక మందన్న పలు హిందీ చిత్రాల్లో నటించింది.

ఇలా వరుసగా రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నార్త్ ఆడియన్స్ కూడా రష్మిక మందన్నను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలో రష్మిక మందన్నకు ఊహించని షాక్ తగిలింది. బాలీవుడ్ నటి రష్మిక మందన్నను కించపరిచేలా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఆమె గురించిన ప్రతి అప్డేట్ ను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఈ క్రమంలో రీసెంట్గా రష్మిక మందన్న కాలుకు తగిలిన గాయాన్ని కూడా ఫోటో షేర్ చేస్తూ మరి అభిమానులకు తెలియజేసింది. అభిమానులు జాగ్రత్తలు చెప్పి భరోసా వ్యక్తం చేశారు. అయితే బాలీవుడ్ నటి యామి గౌతమ్ అలా రష్మిక మందన్న పోస్ట్ పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.... నాకు కూడా సోషల్ మీడియా అకౌంట్ ఉంది. కానీ నేను ఉదయం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనేది మీతో చెప్పాలనుకోలేదు. నేను కూడా జిమ్ లో గాయపడ్డాను, కానీ చెప్పాలనుకోలేదు. అలా చెప్పడం అవసరం అంటారా? అలా నేను ప్రతిదానికి అందుబాటులో ఉండాలనుకోను... అంటూ రీసెంట్ గా షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఆ మాటలు రష్మిక మందన్న గురించే అన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X