‘పుష్ప’ సెట్‌లో రష్మిక.. రాజమండ్రికి బయల్దేరిన బ్యూటీ

ప్రస్తుతం పుష్ప సినిమా పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై జాతీయ స్థాయిలో అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్, ఇచ్చిన అప్డేట్ అందరినీ కట్టిపడేస్తున్నాయి. పుష్ప సినిమాలో బన్నీ ఎంతటి రా లుక్‌లో కనిపిస్తాడో అందరికీ తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో బన్నీ లుక్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

అంతే కాకుండా ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా తమ తమ బెర్త్‌లను ఫిక్స్ చేసేసుకుంటున్నాయి. ఎవరు ఎప్పుడు వస్తున్నామో చెబుతూ డేట్స్‌ను లాక్ చేసుకుంటున్నారు. అదే క్రమంలో పుష్ప టీం కూడా తమకు ఎలాంటి పోటీ లేకుండా చూసుకున్నారు. ఆగస్ట్ 13న ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్ట్ 13న ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది.

Rashmika mandanna joins Allu Arjun Pushpa Set

ఇంత వరకు ఈ మూవీ షూటింగ్‌లో రష్మిక మందాన్న పాల్గొనలేదు. అయితే తాజాగా రష్మిక హైద్రాబాద్ నుంచి రాజమండ్రికి బయల్దేరింది. ఈ లెక్కన చూస్తే రష్మిక పుష్ప సెట్‌లో నేడు అడుగుపెట్టబోతోందన్న మాట. ఇకపై నిరంతరంగా షూటింగ్ చేయబోతోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను సమకూర్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో బన్నీకి కూడా ప్యాన్ ఇండియన్ స్టార్ అనే ట్యాగ్ వచ్చేలానే ఉంది.

Rashmika mandanna joins Allu Arjun Pushpa Set

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X