రష్మీక సినిమాకు అదిరిపోయే ఆఫర్.. గోల్డెన్ లెగ్

కన్నడకు చెందిన హీరోయిన్స్ చాలా వరకు మిగతా ఇండస్ట్రీలలోనే వారి హవాను ఎక్కువగా చూపిస్తుంటారు. ఒక్క హిట్టు వచ్చినా చాలు గ్యాప్ లేకుండా నాలుగైదు సినిమాలకు ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ప్లాన్ సెట్ చేసుకుంటారు. ఇక డబ్బింగ్ సినిమాలు కూడా హీరోయిన్స్ కు అప్పుడప్పుడు బోనస్ గా నిలుస్తుంటాయి. ఇప్పుడు అదే తరహాలో కొనసాగుతోంది రష్మీక మందన్న. ప్రస్తుతం ఆమె చేతిలో సొంత బాషా కన్నడలో తెరకెక్కిన పొగరు అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాపై కన్నడలో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి. ధృవ్ సర్జా హీరోగా నటించాడు. కరాబు అనే సాంగ్ నేషనల్ వైడ్ గా హిట్టవ్వడంతో మిగతా భాషల్లో కూడా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇక తెలుగులో రష్మీక మందన్నకు భారీగా క్రేజ్ ఉందనే ధైర్యం చేత గట్టిగానే ప్లాన్ వేశారు. భారీగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే సినిమా తెలుగు రైట్స్ 3.5కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

Rashmika Mandanna kannada movie pogaru solid telugu rights

ఇటీవల కాలంలో రష్మీక మందన్న గ్యాప్ టూ గ్యాప్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి మార్కెట్ వల్ల రెమ్యునరేషన్ కూడా గట్టిగానే పెరిగింది. అందుకే పొగరుకు గోల్డెన్ ఆఫర్ దక్కింది. అసలైతే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది కానీ చిత్ర యూనిట్ అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. నంద కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటులు సంపత్ రాజ్, పవిత్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X