విజయ్ దేవరకొండకు రష్మిక ముద్దు పేరు.. లీక్ చేసిన నేషనల్ క్రష్!

ఇండియా వైడ్ గా అన్ని సినీ పరిశ్రమల్లో ఉన్న సినీ తారల్లో చాలా మంది డేటింగ్ లు, ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మందే కనిపిస్తూ ఉంటారు. కాగా ఇలా మన తెలుగు సినిమా దగ్గర కూడా చాలా మందే ఉండగా వారిలో ఈ మధ్య కాలంలో మంచి సస్పెన్స్ అండ్ హాట్ టాపిక్ గా మారిన కాంబినేషన్ లలో సెన్సేషనల్ జంట ఒకటి ఉంది.

మరి వారే యంగ్ హీరో విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అని చెప్పాలి. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక కలయికలో రెండు సినిమాలు ఇప్పుడు వరకు వస్తే వాటిలో గీతా గోవిందం సినిమా కమర్షియల్ గా భారీ హిట్ అయ్యింది. కానీ డియర్ కామ్రేడ్ ప్లాప్ అయ్యింది.

rashmika mandanna leaks vijay devarakonda s Pet name

అయినప్పటికీ ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కాగా ఈ రెండు సినిమాలు ప్రయాణమే ఇద్దరు నడుమ ప్రేమకి తోడైంది అని సినీ వర్గాల్లో పలు రూమర్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇద్దరు కూడా తమ వ్యవహారం అలా సాగుతూ కొన్ని హింట్స్ ఇస్తూ వచ్చారు. ఇలా వెంట్రుక వాసి గ్యాప్ తో దాదాపు ఇద్దరూ తమ ప్రేమని బయట ప్రపంచానికి అఫీషియల్ గా చూపించారు.

ఇక ప్రస్తుతం ఇద్దరూ కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా రీసెంట్ గా రష్మిక మందన్నా హిందీలో కొట్టిన బిగ్ హిట్ ఛావా సక్సెస్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా రావడంతో ఆమె పెట్టిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. ఇందులో ఒక పూల బొకే కనిపిస్తుండగా దానికి రష్మిక ఇచ్చిన కొటేషన్ పలు డౌట్స్ తీసుకొస్తుంది. కాగా ఇందులో రష్మిక "నీకు మాత్రమే నా ముఖంలో ఎలా చిరునవ్వు తీసుకురావాలో బాగా తెలుసు పాపలూ" అంటూ పోస్ట్ చేసింది.

rashmika mandanna leaks vijay devarakonda s Pet name

మరి ఇంత ప్రేమగా పిలిచేది ఇంకెవరినో ఎందుకు అవుతుంది డెఫినెట్ గా విజయ్ దేవరకొండనే అని చాలా మంది అనుకుంటున్నారఋ. కాగా ఇంకా ఇందులో హైలైట్ ఏంటంటే రష్మికా విజయ్ ని ముద్దుగా ఇలా పిలుస్తుందా అంటూ ఆ 'పాపలూ' అనే పదం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో రష్మిక లీక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి ఇవన్నీ కాదు ఇద్దరూ కలిసి ఒక గుడ్ న్యూస్ ని అఫీషియల్ గా ఇచ్చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆ మధ్య కొందరు నిర్మాతలు కూడా రష్మిక ఒక తెలుగు హీరోనే పెళ్లి చేసుకుంటుంది అని హింట్ ఇచ్చారు. మరి చూడాలి ఈ జంట ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో అనేది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో "కింగ్ డం" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇపుడు భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమాతో అయినా విజయ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X