Robinhood రాబిన్‌ హుడ్‌ను వదులుకొన్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? శ్రీలీలకు కలిసి వస్తుందా?

సౌత్ సహా తెలుగు సినిమాలోకి ఎంటర్ అయ్యిన కొన్నేళ్లల్లోనే కొంతమంది హీరోయిన్స్ కి దశ గిర్రున తిరుగుతుంది. కొంతమంది ఎంతో కాలం నుంచి స్ట్రగుల్ అయినప్పటికీ.. మరికొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే వద్దన్నా కూడా వరుస ఆఫర్లు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలా ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా దగ్గర మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ బిజీగా మారిపోయిన హీరోయిన్స్ మాత్రం ఓ ఇద్దరు కనిపిస్తారని చెప్పాలి.

కాగా ఆ హీరోయిన్లే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అలాగే మరో యంగ్ బ్యూటీ శ్రీలీల అని చెప్పాలి. కాగా ఈ ఇద్దరికీ కూడా బిగ్ బ్రేక్ ఇచ్చింది మన తెలుగు సినిమానే కాగా ఇపుడు ఈ ఇద్దరు టాప్ బ్యూటీస్ కూడా సౌత్ నుంచి నార్త్ వరకు విస్తరించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ విషయంలో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా కామన్ గా కనిపిస్తాయి.

rashmika mandanna luck will shine for sreeleela or not

రీసెంట్ గానే రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన భారీ హిట్ చిత్రం పుష్ప 2 లో శ్రీలీల మొదటిసారిగా ఒక ఐటెం సాంగ్ ని చేసింది. ఇక దీనితో పాటుగా రష్మిక చేయాల్సిన ఓ సినిమాలో ఆమె ప్లేస్ లో శ్రీలీల హీరోయిన్ గా కూడా చేస్తుంది. కాగా రష్మిక ఉన్న ఫుల్ బిజీలో పలు షెడ్యూల్స్ ని మ్యానేజ్ చేసుకోలేక ఈ కొన్నేళ్లలో పలు సినిమాలు వదిలేసుకుంది.

Take a Poll

కాగా శ్రీలీల కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది కానీ రష్మిక వదులుకున్న సినిమా ఒకటి ఇపుడు శ్రీలీల నుంచి వస్తుంది. మరి ఆ సినిమానే "రాబిన్ హుడ్". యువ హీరో నితిన్ నటించిన ఈ సినిమాలో మొదట రష్మిక మందన్నానే హీరోయిన్ గా తీసుకున్నారు. దీనికి ముందు ఇదే సినిమా దర్శకుడు, నితిన్, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భీష్మ భారీ హిట్ కావడంతో ఈ సినిమాని కూడా అలానే స్టార్ట్ చేశారు కానీ ఈ సినిమా కాస్త రష్మిక నుంచి శ్రీలీలకి షిఫ్ట్ అయ్యింది.

rashmika mandanna luck will shine for sreeleela or not

కాగా రష్మిక వరుస హిట్స్ తో దూసుకెళ్తుంది కానీ శ్రీలీల పరిస్థితి తెలుగులో అలా లేదు. తనకి వరుస ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ వాటిలో సక్సెస్ రేట్ ఒకింత తక్కువే.. కాగా ఇపుడు రష్మిక వదులుకున్న సినిమా కాబట్టి ఆమె లక్ ఏమన్నా శ్రీలీలకి కలిసొస్తుందా లేదా అనేది ఇపుడు సస్పెన్స్ గా మారింది. రాబిన్ హుడ్ తో శ్రీలీల మళ్ళీ ట్రాక్ లోకి వస్తే ఆమె కెరీర్ కి ఇది మరింత ప్లస్ కావచ్చు.

దీనితో ఈ సినిమా పైనే శ్రీలీల కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా ఈ చిత్రంని శ్రీలీలతో వర్క్ చేసిన పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్సే నిర్మాణం వహించగా ఇటీవలే యంగ్ అండ్ హాట్ బ్యూటీ కేతిక శర్మపై ఓ ఐటెం సాంగ్ ని కూడా మేకర్స్ లాంచ్ చేశారు. అలాగే ఈ సినిమా ఈ మార్చ్ 28న రాబోతుండగా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ సినిమాలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X